
| Movie Name | Virata Parvam |
|---|---|
| Director | Venu Udugula |
| Star Cast | Rana, Sai Pallavi??, Priyamani, Nivetha Pethuraj |
| Music | Suresh Bobbili |
| Singer(s) | Vimalakka |
| Lyricist | Mitra |
| Music Label |
మొగులు మీది ఎన్నెలా
నేల రాలెనన్నదా
మొగిలి వనం పొదల జేరి
గుబాళిస్తున్నదా
ఎన్నెలా, ఆ ఎన్నెలా ఆ ఆ
ఇది ఎవరి పాపమని అనుకుందుము
ఇది ఎవరి శాపమని కుములుతుందుము
ఎన్నెలా ఆ ఆ… ఎన్నెలా ఆ ఆఆ
నీకు పురుడుపోసి కన్నదమ్మ అడవీ
నీ ఊపిరెట్ల తీసుకుంటనన్నది
లేత చిగురులు తొడిగిన చిన్నదీ
ఎలా పండుటాకై రాలి ఉన్నదీ
కలల తీరమే త్యాగమనుకున్నది
అలల ఆటుపోట్ల మర్మమెరుగకున్నది
అమరప్రేమ తోని ఆశయాలుగన్నది
ఎలా నీట రాలి నిదురబోతున్నది
ఇది ఏ చీకటి కోణమని అందుమూ
ఒక క్షణకాలపు గ్రహణమనుకొందుము
ఆ మొగిలిపొదలో వెలుగులెతుకుతున్నమూ
నీ పరిమళాలు మదికి తాపుతున్నమూ
ఎన్నెలా ఆ ఆ… ఎన్నెలా ఆ ఆఆ
ఆ పరిమళాలు మదికి తాపుతున్నము
ఆ పరిమళాలు మదికి తాపుతున్నము
Mogulu Meeda Vennela song is from the Virata Parvam movie.
Mogulu Meeda Vennela song was sung by Vimalakka.
Mogulu Meeda Vennela song lyrics were written by Mitra.
Mogulu Meeda Vennela song music was composed by Suresh Bobbili.