| Movie Name | Pandurangadu (2008) |
|---|---|
| Director | K.Raghavendra Rao |
| Star Cast | Bala Krishna, Sneha, Tabu |
| Music | M M Keeravani |
| Singer(s) | M M Keeravani, Malavika & S P Balasubramanyam |
| Lyricist | Suddala Ashok Teja |
| Music Label |
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో… ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు… నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి
చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచీ
కనుమూయాలని ఉన్నదీ
అమ్మా నాన్నా… అమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి
చనిపోవాలని ఉన్నదే
నాన్న అని ఒక్కసారి పిలిచీ
కనుమూయాలని ఉన్నదీ
అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని
(లాలి జోలాలి) (లాలి జోలాలి) (లాలి జోలాలి)
నీ ప్రాణం పనంపెట్టి… నాకు పురుడు పోశావనీ
నీ నెత్తుటి ముద్దయే… నా అందమయిన దేహమనీ
బిడ్డ బతుకు దీపానికి… తల్లి పాలే చమురనీ
తెలియనైతి తల్లీ… ఎరుగనైతినమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగు ముడిని… తెంపివేసిన కసాయినీ
మరచిపోయి కూడా నను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ
నాన్నా నీ గుండెపైన… నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలితో… లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే… ఆదిదేవునకు అది అందుననీ
అమ్మకు బ్రహ్మకు… మధ్యన నాన్నే ఒక నిచ్చెననీ
తెలియనైతి తండ్రీ… ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే… దేవాలయమని మరచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా… ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా… నను మన్నించొద్దమ్మా
కలనైనా నను… కరుణించొద్దు నాన్నా
కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే
ఇచ్చాడు క్షమించే హృదయం
మా ఆయువు పోసుకోని నీవు
వర్దిల్లు కలకాలం
(శతమానం భవతి… శతాయుష్మాన్ భవ
శతమానం భవతి… శతాయుష్మాన్ భవ)
Matrudevobhava Anna Maata song is from the Pandurangadu movie.
Matrudevobhava Anna Maata song was sung by M M Keeravani, Malavika & S P Balasubramanyam.
Matrudevobhava Anna Maata song lyrics were written by Suddala Ashok Teja.
Matrudevobhava Anna Maata song music was composed by M M Keeravani.