| Movie Name | Pandurangadu (2008) |
|---|---|
| Director | K.Raghavendra Rao |
| Star Cast | Bala Krishna, Sneha, Tabu |
| Music | M M Keeravani |
| Singer(s) | M M Keeravani, Sunitha & Madhu Balakrishnan |
| Lyricist | Sri Vedavyas |
| Music Label |
గోపాల బాలకృష్ణ గోకులాష్టమి… ఆబాలగోపాల పుణ్యాల పున్నమి
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని
నంద నందనుడు నడచిన చోటే నవనందనవనీ, ఈ ఈఈ
గోపికా ప్రియ కృష్ణహరే నమో… కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే నమో… వేదాంతి విద్య కృష్ణహరే
గోపికాప్రియ కృష్ణహరే నమో… కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే నమో… వేదాంతి విద్య కృష్ణహరే
ఆఆ ఆ ఆ ఆ ఆ, గోవిందుడె కోక చుట్టి
గోపెమ్మ వేషం కట్టి… ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా
గోవిందుడె కోక చుట్టి… గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా
నవ మోహన జీవన వరమిచ్చెనమ్మా
ఇకపై ఇంకెపుడూ నీ చేయి విడిచి వెళ్ళనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా
దేవకి వసుదేవ పుత్ర హరే నమో… పద్మపత్ర నేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే నమో… యశోద నందన కృష్ణహరే
దేవకి వసుదేవ పుత్ర హరే నమో… పద్మపత్ర నేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే నమో… యశోద నందన కృష్ణహరే
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు… ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చెనమ్మా
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మ
వెన్నపాలు ఆరగించీ… విన్నపాలు మన్నించీ
వెన్నపాలు ఆరగించి… విన్నపాలు మన్నించి
వెండి వెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మ
కళ్యాణరాగ మురళి కలలు చిలికెనమ్మ
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మ
గోవర్ధనోద్దార కృష్ణహరే నమో… గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో… గోపిక వల్లభ కృష్ణహరే
గోవర్ధనోద్దార కృష్ణహరే నమో… గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో… గోపిక వల్లభ కృష్ణహరే
గోవిందుడె కోక చుట్టి… గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా
తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా
తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా
మన అడుగున అడుగేసి… మనతోనే చిందేసి
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా
కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మ
హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా
శ్రీ పాదం ఉన్న చోట… సిరులు విరియునమ్మా,ఆ ఆఆ
ఆపదోద్ధారక కృష్ణహరే నమో… ఆనంద వర్ధక కృష్ణహరే
లీలా మానుష కృష్ణహరే నమో… కాల విలాస కృష్ణహరే
ఆపదోద్ధారక కృష్ణహరే నమో… ఆనంద వర్ధక కృష్ణహరే
లీలా మానుష కృష్ణహరే నమో… కాల విలాస కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో… గోపిక వల్లభ కృష్ణహరే
గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో… గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో… గోపిక వల్లభ కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో… గోపిక వల్లభ కృష్ణహరే
Govindude Koka Chutti song is from the Pandurangadu movie.
Govindude Koka Chutti song was sung by M M Keeravani, Sunitha & Madhu Balakrishnan.
Govindude Koka Chutti song lyrics were written by Sri Vedavyas.
Govindude Koka Chutti song music was composed by M M Keeravani.