| Movie Name | & English - April 1 Vidudala |
|---|---|
| Director | Vamsy |
| Star Cast | Rajendra Prasad, Shobhana |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Vennelakanti |
| Music Label |
మాటంటే మాటేనంటా
కంటబడ్డ నిజమంతా అంటా
ఋజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూ ఉంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే
భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా
తప్పులుంటె ఒప్పనంట
నీ వెంటే నేను ఉంటా
చూస్తుంటా ఓరకంటా
నిజమంటూ నీలుగుతుంటే
ముప్పు నీకు తప్పదంటా
జణక్కు జుమ్మ..!
మాటంటే మాటేనంటా కంటబడ్డ
నిజమంతా అంతా అంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
నువ్వే మా మొదటి గెస్టని
మా ఆవిడ వంట బెస్టని
ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ
టేస్టు చెప్పి పోరా
ఇదే మా విందుభోజనం
మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలూ
ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా… అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది… పదార్ధం చెత్తగున్నదీ
ఇది విందా, నా బొందా… తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా… పదర కుంకా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంటా
గోపీ నా పక్కనుంటే
భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా
తప్పులుంటె ఒప్పనంట
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
ఋజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూ ఉంటా
భళారే నీలి చిత్రమా… భలేగా ఉంది మిత్రమా
ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా
కోరావూ అసలు ట్రూతును… చూపాను సిసలు బూతును
చిక్కారూ తప్పుచేసి… ఇక మక్కెలిరగదన్నూ
తమాషా చూడబోతిరా… తడాఖా చూపమందురా
మగాళ్ళని అదిరిపడితిరా… మదించీ మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా, బెండు తీస్తా
మాటంటే మాటేనంటా… కంటబడ్డ నిజమంతా అంటా
ఋజువంటూ దొరికిందంటే… గంట కొట్టి చాటేస్తూ ఉంటా
నీ వెంటే నేను ఉంటా… చూస్తుంటా ఓరకంటా
నిజమంటూ నీలుగుతుంటే… ముప్పు నీకు తప్పదంటా
జణక్కు జుమ్మా..!!
మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
మొదలంటూ చెడతావంటా… వెంటబడి తెగ తంతారంటా
Matante Matenanta song is from the & English - April 1 Vidudala movie.
Matante Matenanta song was sung by S P Balasubramanyam, KS Chitra.
Matante Matenanta song lyrics were written by Vennelakanti.
Matante Matenanta song music was composed by Ilayaraja.