| Movie Name | & English - April 1 Vidudala |
|---|---|
| Director | Vamsy |
| Star Cast | Rajendra Prasad, Shobhana |
| Music | Ilayaraja |
| Singer(s) | Mano, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
చుక్కలు తెమ్మన్నా… తెంచుకు రానా
చూస్తావా నా మైనా… చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా… తెంచుకు రానా
చూస్తావా నా మైనా… చేస్తానే ఏమైనా
షోలే ఉందా…?
ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా
తెలుగులో తీశారే బాలా
ఖైదీ ఉందా..?
ఇదిగో ఇందా..!
ఖైదీ కన్నయ్య కాదే, ఏ ఏఏ
వీడికి అన్నయ్య వాడే
జగదేకవీరుడి కధా… ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా… ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
ఒకటా రెండా… పదులా వందా
బాకీ ఎగవేయకుండా, ఆ ఆఆ
బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా… మతి పోయిందా
చాల్లే మీ కాకి గోలా, ఆ ఆఆ
వేళా పాళంటూ లేదా
ఏవైంది భాగ్యం కధ?
కదిలిందా లేదాకధా?
వ్రతమేదో చేస్తోందటా
అందాక ఆగాలటా
లౌక్యంగా బ్రతకాలీ
సౌఖ్యాలే పొందాలి
చుక్కలు తెమ్మన్నా… తెంచుకు రానా
చూస్తావా నా మైనా… చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
Chukklau Themmanna song is from the & English - April 1 Vidudala movie.
Chukklau Themmanna song was sung by Mano, KS Chitra.
Chukklau Themmanna song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Chukklau Themmanna song music was composed by Ilayaraja.