
| Movie Name | Seethayanam |
|---|---|
| Director | Prabhakar Aaripaka |
| Star Cast | Akshith Shashikumar, Anahita Bhooshan |
| Music | Padmanabh Bharadwaaj |
| Singer(s) | Swetha Mohan |
| Lyricist | Chandra Bose |
| Music Label | Lahari Music | T-Series |
దినన దోం తనన దీంత దోం తనన… దినన దినన త న నా న
దినన దోం తనన దీంత దోం తనన… దీంత దీంత దినన
మ గ స ని స… స స గ గ స
మ గ స ని స… స స మ మ గ
మా గ స ని స… స స గ గ స
మ గ స ని స…
మనసు పలికే నీ మాటనే… పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే… కలలు తిరిగే నీ వైపునే
హృదయమడిగె నీ రాకని… నుదురు నిలిపే నీ రేఖని
నిదుర చెదిరే నీ వల్లనే… నిమిషమొదలి నీ వెల్లనే
బ్రతుకు జరిపే నీ పూజని…
తనువు బ్రతికే నీ ప్రేమ… అందుతుంది అన్న ఆశతోనే
నిన్నే కోరుకొని, నిన్నే నమ్ముకొని… నిన్నే నింపుకొని నా మది
తేనెటీగ చుట్టు పువ్వే ఎగిరినట్టు… తీయ్యగ ఎగురుతు ఉన్నాది
ఇది విభిన్నం, ఇది విచిత్రం… ప్రియ ప్రయత్నం
వాగు వెనకపడి… కడలి తిరిగినాది
నేల వెనకపడి… నింగి తిరిగినాది
సింహమెనకపడి… జింక తిరిగినది
ప్రాణమెనకాల ప్రాణి ఈనాడు… ప్రేమకై తిరిగేనే
మనసు పలికే నీ మాటనే… పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే… కలలు తిరిగే నీ వైపునే
శివుని ధనుస్సు లేదు… స్వయంవరం లేదు
సూటిగా నిలిచా సీతనై… పడుచు ప్రాయమే పూలమాలగా
మెడలో వేస్తా నీదాన్నై… అని అంటున్నా, వినమంటున్నా… అరె ఈపైన
బేలతనము ఇక బలము బలగమై… బెరుకు బెదురులిక చురుకు చొరవలై
దాపరికము ఎనలేని ధైర్యమై… యుగములెన్నైనా జగము ఏదైనా
వదలనే వదలనే…
మనసు పలికే నీ మాటనే… పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే… కలలు తిరిగే నీ వైపునే
Manasu Palike song is from the Seethayanam movie.
Manasu Palike song was sung by Swetha Mohan.
Manasu Palike song lyrics were written by Chandra Bose.
Manasu Palike song music was composed by Padmanabh Bharadwaaj.