| Movie Name | Seethayanam |
|---|---|
| Director | Prabhakar Aaripaka |
| Star Cast | Akshith Shashikumar, Anahita Bhooshan |
| Music | Padmanabh Bharadwaaj |
| Singer(s) | Yazin Nizar & Sameera Bharadwaj |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Lahari Music | T-Series |
కనుల నుంచి కనుల దాకా
కదులుతుందో సంబరం
మనసు నుంచి మనసు దాక
ఉరుకుతుందో సాగరం
ఆశ నుంచి ఆశ దాకా
దూకుతుందో వరం
ఉండలేనిక రవ్వంత దూరం
మోయలేనిక మువ్వంత భారం
చేరా వయసు తీరం
వేసెయ్ వలపు హారం
నీకూ నాకూ లేదే అంతరం
కనుల నుంచి కనుల దాకా
కదులుతుందో సంబరం
మౌనం చేసే ఈ మాయలో
మొన్న నిన్న మాయం
ఇలాగే ఇలాగే అల్లుకుపోయే పెదాలే
కాలాన్నింకా ఏలాలంది లోలో నిర్ణయం
ఇన్నాళ్ల వేసవినింకా చల్లార్చగా
ఇవ్వాళ వెన్నెల్లు చల్లాలిక
నీలోని నాలోని సరాగం
తియ్యంగా తియ్యాలి ఏదో రాగం
నాపై వాలే నీ ఊపిరి
విసిరే ప్రేమ బాణం
యుగాన్ని క్షణంగా తెంచుతూ ఉంటే
నిజంగా నాలో సర్వమౌతు ఉంది నీకే అర్పణం
బింకాల విల్లును వంచే నీ జవ్వనం
అందంగా రాసింది సీతాయానం
నా నుంచి నీలోకి ప్రయాణం చేశాక
తెలిసింది నువ్వే ప్రాణం
Kanula Nunchi song is from the Seethayanam movie.
Kanula Nunchi song was sung by Yazin Nizar & Sameera Bharadwaj.
Kanula Nunchi song lyrics were written by Ananth Sriram.
Kanula Nunchi song music was composed by Padmanabh Bharadwaaj.