
| Movie Name | The Life Of Muthu |
|---|---|
| Director | Gautham Vasudev Menon |
| Star Cast | SilambarasanTR, Siddhi Idnani |
| Music | AR Rahman |
| Singer(s) | Pooja AV |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
పది తలల పామా వచ్చి ముద్దులిచ్చిపోరా
నే ఒంటరిగానే చస్తూ ఉన్నా
ఇలా స్వప్నములో కంటపడే
నిన్నిలా చూస్తూ ఉన్నా
హే, ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
ఎలాగైనా రారా, వచ్చి ఒళ్ళో వాలిపోరా
గుమ్మమే చూడగా గొళ్ళెమే ఉంది
బావిలో బొక్కెన నిండుగా ఉంది
పొట్టకొసమెల్తే అంత దూరం
వెర్రిదాని గుండే కొండంత భారం
కాపు కాసి కాపు కాసి కన్ను ఏడ్చెనే
ఊటలూరే కన్నీట్లో పడవే ఊగే
హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా టెన్ టు ఫైవ్ ఎప్పుడొస్తావురా
మామ ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
పది తలల పామా పామా పామా
ముద్దులిచ్చిపోరా పోరా పోరా
పది తలల పామా
ఓయ్ ముద్దులిచ్చిపోరా మచ్చా
హే మచ్చా మచ్చా మచ్చా మచ్చా
మచ్చా మచ్చా మచ్చా
మచ్చా ఎప్పుడెలతావు
మచ్చా ఎప్పుడు ఎప్పుడు
మచ్చా ఎప్పుడెలతావు-రా
దూరమే నాకిలా దుఃఖమై మారే
పక్కనే బతికితే నాకంతే చాలు
ఊరు నిదురనుంటే నా ధ్యాస నీదే
కోడి కూసే వేళా కునుకేమో చేరే
ఆడ నీవు ఈడ నేను ఏమి జీవితం
పోనీ పోనీ అనకుండా వచ్చేస్తావా
హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
చూరుకేసి చూస్తూ నేను పాణం ఇడుస్తారా
అరె ఎంతని వేచి సూడాలిరా
ఎద లోతులో అటు ఇటు ఊగెనే, కొన ఊపిరే
బయటదానిలా మాటాడలేని వైనం
సప్పుడొస్తే సాలు పడుకుండిపోయే దీనం
నువ్వు ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
సెప్పకుండా వచ్చి నను సక్క ఎత్తుకోరా
Malle Poovu song is from the The Life Of Muthu movie.
Malle Poovu song was sung by Pooja AV.
Malle Poovu song lyrics were written by Krishna Kanth.
Malle Poovu song music was composed by AR Rahman.