
| Movie Name | Alipiriki Allantha Dooramlo |
|---|---|
| Director | Anand J |
| Star Cast | Raavan Reddy, Sri Nikitha, Alankritha Sha |
| Music | Phani Kalyan |
| Singer(s) | Shankar Mahadevan & Ramya Behra |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Saregama Telugu |
విశ్వ మనోజ్ఞ ప్రదాయిక
హైందవ ముద్రిక
ఇహముకి పరముకి నడుమన
గడప ఇదే… తిరుపతి
జనులే తరలి చేరే కిటకిటల
పర్యాటకుల పట్టణం
ఎవరూ మరిచిపోని అనుభవము
ఇచ్చేటి గొప్ప పట్టణం
అటు పుణ్యాత్ముల… ఇటు పాపాత్ముల
ఇరు పాదాలనే… తను మోసెనుగా
శుభకార్యాలకి చిరునామా అని
ప్రతి రోజు తానే విలసిల్లిందిగా
పరాయి భాషని తెలీని వాడని
తేడాలు చూడని పట్టణం
ఇది ఏడాది పొడుగునా ప్రతొక్క ఇంటికి
బంధువులోచ్చే పట్టణం
పాతాళమొచ్చిన నివాసముండనే
విశాలమైన తిరుపతి
ధగధగద్దగాయము దేదీప్యమానము
నైనాానందం తిరుపతి
మరి ప్రసాదం అంటే… ఉండే తీరాలిగా
తిరుపతి లడ్డూ తప్పక
ఇక ప్రపంచమంతట ప్రతీ గృహమ్మున
పటాలు పెట్టే తిరుపతి… మా తిరుపతి
సందుకొక అట్ల దుకాణం ఆహ్వానం
వేకువకే అందం
పూల కోట్ల నీటి తుంపరే సింగారం
సామికి వైభోగం
జల జల కురవగా మురిసిన
జనుల మదే కపిలతీర్థం
ఆ, కృష్ణదేవరాయలోరి ఆశే మోసే
అలిపిరిలో గోపుర దర్శనం
ఆ, సంస్కృత భాషకి పట్టము కట్టగా
దేవుని మనిషికి చేరవు చేయగా
సిరి గల నగరమిదే తిరుపతి
కలలకి కొలువు ఇదే తిరుపతి
శీను వెంకీ హరి హరి
గోవింద విష్ణు సప్తగిరి
పక్కన నడిచే మనిషిని
ఈ పేర్లతో పిలిచే చోటిది
కాలి నడకన ఎక్కినా
మెట్ల అలసట సాక్షిగా
దారి పొడుగునా జోరుగా
గోవింద భజనే సాక్షిగా
వైకుంట ద్వారము దాటంగ
మూల విరాట్ రూపమదే
క్షణాల వ్యవధే జన్మల ఋణమే
ఆ సామి దర్శనమే
అన్నమయ్య ఘంటమును పట్టినది ఇచ్చటే
పరమాత్మలో కలిసినది
చుట్టు ఉన్న పల్లెలన్నీ కలుపుకుని
జరిపే గంగమ్మ జాతర ఇచ్చటే
గిరిపై ప్రభువుకే పట్టంగా
ఎదపై నిలిపిన పట్నమిది
బిడ్డనే భుజంపై మోయంగ
తానే తండ్రిలా మారినది
తానే తిరుపతై సాగినదే
జనులే తరలి చేరే కిటకిటల
పర్యాటకుల పట్టణం
ఎవరూ మరిచిపోని అనుభవము
ఇచ్చేటి గొప్ప పట్టణం
అటు పుణ్యాత్ముల… ఇటు పాపాత్ముల
ఇరు పాదాలనే… తను మోసెనుగా
శుభకార్యాలకి చిరునామా అని
ప్రతి రోజు తానే విలసిల్లిందిగా
తిరుపతి, గోవింద గోవిందా… గోవిందా
Ma Tirupathi song is from the Alipiriki Allantha Dooramlo movie.
Ma Tirupathi song was sung by Shankar Mahadevan & Ramya Behra.
Ma Tirupathi song lyrics were written by Kittu Vissapragada.
Ma Tirupathi song music was composed by Phani Kalyan.