| Movie Name | & English - Daddy |
|---|---|
| Director | Suresh Krishna |
| Star Cast | Chiranjeevi, Simran, Ashima Bhalla |
| Music | S A Raj Kumar |
| Singer(s) | Shankar Mahadevan |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ
ఈ లోకంలో పుట్టడమే లక్కీ
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ, ఓవాయో
ఈ లోకంలో పుట్టడమే లక్కీ, ఓవాయో
వందేళ్లకి నీ ఊపిరి పోదా కొండెక్కి
వెయ్యెల్లైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కి
ఆడు ఆడించు, పాడు పాడించు… నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ (లక్కీ లక్కీ)
ఈ లోకంలో పుట్టడమే లక్కీ
అదృష్టానికి టాటా చెప్పెయ్
నీ కష్టానికి కోట పెంచెయ్
ఆవేశానికి బై బై చెప్పేయ్
అనురాగానికి భాగం పంచేయ్
మనలోని గుండెకు… పొరుగోడి గుండెకు
నడి మధ్య గోడలు కట్టొద్దోయ్
మనసున్న చేతితో… పక్కోడి చంపపై
కన్నీటి చారలు తుడవాలోయ్
అందరికోసం ఆలోచించు ఆనందించు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ, (లక్కీ లక్కీ)
ఈ లోకంలో పుట్టడమే లక్కీ
బాంబులు లేని… జగతిని చూద్దాం
బాధల్లేని బ్రతుకులు చూద్దాం
చీకటి లేని… గడపలు చూద్దాం
ఆకలి లేని… కడుపులు చూద్దాం
నేరాలే తక్కువై… ఖైదీలే ఉండనీ
సరికొత్త జైల్లను చూడాలోయ్
భగవంతు మాయమై మమతేమో దైవమై
కొలువున్నా గుళ్లను చూడాలోయ్
ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమే వంచు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ, ఓవాయో
ఈ లోకంలో పుట్టడమే లక్కీ, ఓవాయో
వందేళ్లకి నీ ఊపిరి పోదా కొండెక్కి
వెయ్యెల్లైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కి
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
Lucky Lucky song is from the & English - Daddy movie.
Lucky Lucky song was sung by Shankar Mahadevan.
Lucky Lucky song lyrics were written by Chandra Bose.
Lucky Lucky song music was composed by S A Raj Kumar.