
| Movie Name | Enemy |
|---|---|
| Director | Anand Shankar |
| Star Cast | Vishal, Arya, Mamta Mohandas, Mirnalini Ravi |
| Music | Thaman S |
| Singer(s) | RR Dhruvan |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Divo Music |
గట్టిగా వెయ్ రా బచ్చా… కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం… కమ్మే జనం మనూరి వాళ్ళం
కట్టేద్దాం మిద్దెలిట్టా… కళ్ళతో మబ్బుల్ ముట్టా
పట్టణం కట్టీ పెట్నం… పెద్దా చిన్నా ఉండేట్టివ్వాలా
హే, ఎప్పుడో వచ్చినంరా… ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా… చక్రం చేసి తిప్పామీవేళ
హే, అక్కడా తీరాలల్లో… చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టూకుంటూ నెగ్గామీనేలా
ఏరా పోదాం రారా… రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా… రా పొంచేటి సింగం కారా
గట్టిగా వెయ్ రా బచ్చా… కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం… కమ్మే జనం మనూరి వాళ్ళం
సింగపూరోడు వచ్చి దర్జాగా… నించున్న సూర్యుడు
ఇంత సీమను కాపు కాచే కాలుడు
మామ నువు చూడు చూడు… మాలో మాలో స్పెషలు
చూడు చూడు చూడు మామ… సింగపూరు తెలుగువాడి కథలు
ఒక్కచోటికొస్తే పుట్టే నిధులు
లూకింగ్ మోడెర్నిటి మామా… కళ్ళను కట్టేస్తుంది తెలుగమ్మి
మట్టి తవ్వితే చెమటలూరు మామా
మిన్ను నక్షత్రముల్ తాకు ఊరు… గోదారిలాగ ఈడ పారు
మోడెర్న్ మేళ తాళముల హోరు
ఏనాడు మరువద్దు చెట్టులాంటి నువ్వు నీ పేరు
రైలెల్లే దారుల్లోన… ఒళ్ళోంచి కష్టించాం
కూడిచ్చే దేశం కోసం… కూలీలై కష్టించాం
అనుబంధాలెన్నో ఉండే సొగసైన ప్రపంచం
గతము ఆ భవిష్యత్తు ఒకటై మేం జీవించాం
హే, ఎప్పుడో వచ్చినంరా… ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా… చక్రం చేసి తిప్పామీవేళ
హే, అక్కడా తీరాలల్లో… చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టూకుంటూ నెగ్గామీనేలా
ఏరా పోదాం రారా… రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా… రా పొంచేటి సింగం కారా
Little India song is from the Enemy movie.
Little India song was sung by RR Dhruvan.
Little India song lyrics were written by Ananth Sriram.
Little India song music was composed by Thaman S.