
| Movie Name | Highway () |
|---|---|
| Director | A KV Guhan |
| Star Cast | Anand Devarakonda, Manasa Radhakrishnan |
| Music | Simon K. King |
| Singer(s) | Sanah Moidutty, Yazin Nizar |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Aditya Music |
కొమ్మలో నక్కి నక్కి ఉండే పిట్ట
రెక్కలు కట్టిందా
గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్టా
మూటే కట్టిందా
దారిలో అట్టా ఇట్టా ఊపే గాలి
తోడై వచ్చిందా టెన్ టు ఫైవ్
మబ్బుల దారే పట్టి
చుట్టి చుట్టి వద్దామందా
ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో
ఇన్నాళ్లు ఈ గుండెల్లో
ఇంగో అంగో ఎన్నెన్ని ఆనందాలు
ఇంకా ఎన్నో ఈ లోకంలో
ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో
ఇన్నాళ్లు ఈ గుండెల్లో
ఇంగో అంగో ఎన్నెన్ని ఆనందాలు
ఇంకా ఎన్నో ఈ లోకంలో
నడకలపై గడపమనే గతమేమైపోయెనో
కిలకిలలై మిలమిలలై కాలమెలా చేరెనో
ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో
ఇన్నాళ్లు ఈ గుండెల్లో
ఇంగో అంగో ఎన్నెన్ని ఆనందాలు
ఇంకా ఎన్నో ఈ లోకంలో
కొమ్మల్లో నక్కి నక్కి ఉండే పిట్ట
రెక్కలు కట్టిందా టెన్ టు ఫైవ్
గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్టా
మూటే కట్టిందా
దారిలో అట్టా ఇట్టా ఊపే గాలి
తోడై వచ్చిందా
మబ్బుల దారే పట్టి
చుట్టి చుట్టి వద్దామందా
ఎండ కన్నే ఎరగని కన్నె
ఎదురైంది తొలిసారి
వింతలన్ని వెలవెలబోయే
వెలుగుల్ల చిన్నారి
బాగుందే బాగుందే తనతోటి ఈ దారి
ఏ ఊరికావురు ఎంతెంత అందం ఉందొ
ఏ చోటికాచోటు ఎన్నెన్ని అందిస్తుందో
ఈ చెట్టు చేమ ఆ వాగు వంక
ఇన్నన్ని చిరునవ్వులు
నాకే జన్మల్లో నేస్తాలు
ఓ ఓ, ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో
ఇన్నాళ్లు ఈ గుండెల్లో
ఇంగో అంగో ఎన్నెన్ని ఆనందాలు
ఇంకా ఎన్నో ఈ లోకంలో
ఇంచుమించు మెరుపుని మించు
సొగసున్న యువరాణి
కొంచమైనా కిరికిరి లేని
మనసున్న మహారాణి
తోడైతే తప్పేంటి ఏదేమైనా గాని
చీకట్నే చూసి నేను చంద్రున్నే చూస్తున్నాను
నాలోనే దాగే నేను మెల్లంగా పైకొచ్చాను
ఈ మాట మంతి ఆ తీరు తెన్నూ
ఎందాక వెళుతుందో హో
నన్నే తీరంలో ముంచేవో
కొమ్మలో నక్కి నక్కి ఉండే పిట్ట
రెక్కలు కట్టిందా
గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్టా
మూటే కట్టిందా
దారిలో అట్టా ఇట్టా ఊపే గాలి
తోడై వచ్చిందా
మబ్బుల దారే పట్టి
చుట్టి చుట్టి వద్దామందా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Kommallo Nakki Nakki song is from the Highway movie.
Kommallo Nakki Nakki song was sung by Sanah Moidutty, Yazin Nizar.
Kommallo Nakki Nakki song lyrics were written by Ananth Sriram.
Kommallo Nakki Nakki song music was composed by Simon K. King.