| Movie Name | Uppena (2021) |
|---|---|
| Director | Buchi Babu Sana |
| Star Cast | Panja Vaisshnav Tej |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Jaspreet Jasz & Shreya Ghoshal |
| Lyricist | Sreemani |
| Music Label | Aditya Music |
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను
హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసేనె
హే ఇటు చూడకుంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసేనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసేనే హా
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను
సముద్రమంత ప్రేమ ముత్యమంత మనుసు
ఎలాగ దాగి ఉంటుందో లోపల
ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం
ఎలాగే బయట పడుతోంది ఈ వేళా హ
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘాన్నితో ప్రయాణం
ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను
తెంచలేదు లోకం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగా వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగా దిన్నీ గుండెల్లో దాచడం
ఎపుడు లేనిది ఏకాంతం
ఎక్కడలేని ఎదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమే సొంతం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను