
| Movie Name | & English - Uniki |
|---|---|
| Director | Rajkumar Bobby |
| Star Cast | Chitra Shukla, Ashish Gandhi |
| Music | Peddapalli Rohith (PR) |
| Singer(s) | Dhanunjay Seepana |
| Lyricist | Suresh Banisetti |
| Music Label | Aditya Music |
జడతో జాగ్రత్త బామ్మర్ది
నీకు మడతడి పోతాది బామ్మర్ది
ముక్కు పుడకతో జాగ్రత్త బామ్మర్ది
బొక్కబోర్లా పడతావు బామ్మర్ది
ఓనితో జాగ్రత్త బామ్మర్ది
నిన్ను ఊదేస్తాది బామ్మర్ది
మిడ్డితో జాగ్రత్త బామ్మర్ది
నడ్డి విరిచేస్తాది బామ్మర్ది
మన గుండె పానీపూరి లెక్కన
కనిపిస్తాదేమో పోరీలకి
ఒక్క గుటకలో మింగేసి టక్కున
మూతి తూడ్సుకోని పోతారు పక్కకి
పాలపిట్టల్లా కనబడే… వడ్రంగి పిట్టలు వీళ్ళురా
ఓ పక్క నవ్వేస్తుంటారే… ఇంకోపక్క తవ్వేస్తుంటారే
నమ్మకు నమ్మకు పాపాల్ని… నమ్మినా ఇవ్వొద్దు మనసుని
సెయ్యొద్దు సెయ్యొద్దు లవ్వుని… సెసావంటే బతుకు బఠాణి
మనమే ముదుర్లంటే… మనల్ని మించిన ముదుర్లురా
మత్తులో పడ్డావంటే… మట్టిలో కలిసిపోతావురా
మగాళ్లు వట్టి మాయగాళ్లని… పాటలు పాడేస్తుంటారే
చేసేవన్నీ చేసేస్తారే… నిందలు అన్నీ మనపై తోసేస్తారే
పులిహోర కలిపెయ్యడంలోనా… సెయ్యే తిరిగిన వంటొళ్లురా
అయ్ బాబోయ్ ఈళ్ళతో పోటీనా… మనము ఎక్కడ సరిపోతామురా
నమ్మకు నమ్మకు పాపాల్ని… నమ్మినా ఇవ్వొద్దు మనసుని
సెయ్యొద్దు సెయ్యొద్దు లవ్వుని… సెసావంటే బతుకు బఠాణి
సరిగ్గా సూడాలేగాని… సందుకో దేవదాసు ఉంటాడు
పాపనే గోకొద్దని… నాలా ఎవడో సెప్పే ఉంటాడు
ఇనకపోతే ఎవడి కర్మని… ఎవడు బాగు చేస్తాడు
ఇనపరాడ్డు దిగితేగానీ.. ఎవడి బుర్రా పని సెయ్యదు
నవ్వుల పువ్వుల గుత్తులు… మాటలు తియ్యని కత్తులు
అమ్మాయిలూ ఏసారో ఎత్తులు… కనిపెట్టలేరే ముక్కోటి దేవుళ్ళు
నమ్మకు నమ్మకు పాపాల్ని… నమ్మినా ఇవ్వొద్దు మనసుని
సెయ్యొద్దు సెయ్యొద్దు లవ్వుని… సెసావంటే బతుకు బఠాణి
Jadatho Jagratha Bammardi song is from the & English - Uniki movie.
Jadatho Jagratha Bammardi song was sung by Dhanunjay Seepana.
Jadatho Jagratha Bammardi song lyrics were written by Suresh Banisetti.
Jadatho Jagratha Bammardi song music was composed by Peddapalli Rohith (PR).