| Movie Name | Pelli Sandadi (1996) |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Srikanth, Ravali & Deepti Bhatnagar |
| Music | M M Keeravani |
| Singer(s) | Mano, Keeravani, Swetha Naga |
| Lyricist | Chandra Bose |
| Music Label |
బిక్కు బిక్కు బిక్కుమంటు… వంట ఇంట నక్కాము
లక్కు మాకు దక్కునంటు… ఇక్కడొచ్చి పడ్డాము
కొంటెదాని జాడ లేక… గంటె చేతపట్టాము
పిట్ట నేడు కానరాక… పిండి రుబ్బుతున్నాము
అయినా చిక్కలేదు… చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
దప్పలాలు గుప్పుమంటు… గొప్పగుంది మా వంట
అప్పడాలు చేయకుండ… తప్పలేదు ఈ పూట
మక్కువైన చెక్కిలాలు… సుబ్బరంగ బొబ్బట్లు
చక్కనైన చుక్క కొరకు… లెక్కలేని ఇక్కట్లు
పెరుగు పచ్చడి… పులిహోర పొంగలి
సాపాటు రెప్పపాటులో రెడీ
నాభి సుందరి… నాలోని ఊపిరి
వరించి చేరుటెప్పుడో ఒడి
స్వీటులెన్నో హాటులెన్నో… ధీటుగానే వండినాము
రొస్టులోన టేస్టులెన్నొ… రెస్టులేక నింపినాము
అయినా, చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
హ, చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
చిటెకలోనె సిద్దమయ్యే… జాంగిరీలు ఎంచక్కా
గుటకలోన కరిగిపోవు… గులాబ్జాము ఈ పక్క
పాలకోవ పంచదార… పాయసాలు ఓపిగ్గా
పెళ్ళి విందులోకి… వండి వార్చినాము భేషుగ్గా
నేతి బూరెలు… లేలేత గారెలు
భలేగ కొలువుతీరి ఉన్నవీ
పూతరేకులు కచోరి అరిసెలు
ఊరించి రుచులు పెంచుతున్నవి
మచ్చ ఉన్న మాయలేడి… వేటకొచ్చి వేగినాము
స్వచ్చమైన నెయ్యిలోన… వంటకాలు వేపినాము
చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో
బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో
పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది
ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది
Iyna Chikkaledu song is from the Pelli Sandadi movie.
Iyna Chikkaledu song was sung by Mano, Keeravani, Swetha Naga.
Iyna Chikkaledu song lyrics were written by Chandra Bose.
Iyna Chikkaledu song music was composed by M M Keeravani.