| Movie Name | & English - Khaidi |
|---|---|
| Director | A Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Madhavi, Sumalatha |
| Music | Chakravarthy |
| Singer(s) | S P Balasubramanyam, Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
గోరింట పూసింది… గోరింక కూసింది
గొడవేమిటే రామచిలకా… గొడవేమిటే రామచిలకా
నే తీర్చనా తీపి అలకా, ఆ ఆ
నే తీర్చనా తీపి అలకా..!
గోరింక వలచింది… గోరింట పండింది
కోరిందిలే రామ చిలక… కోరిందిలే రామచిలక
నీ ముద్దు నా ముక్కుపుడక, ఆ ఆ
నీ ముద్దు నా ముక్కుపుడక
ఏలో ఏలో… ఏలేలో ఏలో
ఏలో ఏలో… ఏలేలో ఏలో
పొగడాకు తేనేల్తో… పొదరిల్లు కడిగేసి
రతనాల రంగులతో… రంగవల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి… కూర్చుంటే
ఆఆ ఆఆ ఆ ఆ
సొదలేమిటే రామచిలక… సొదలేమిటే రామచిలక
సొగసిచ్చుకో సిగ్గు పడక, ఆ ఆ… సొగసిచ్చుకో సిగ్గుపడక
గోరింక వలచింది… గోరింట పండింది
ఆహా హా ఆహా హా… ఆహా హా ఆహా హా
విరజాజి రేకుల్తో… విరిసెయ్య సవరించి
పండు వెన్నెల పిండి… పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే… నిశిరాత్రి తోడుంటే
ఆ ఆ ఆఆ ఆఆ ఆ
కొదవేమిటే గోరువంక… కొదవేమిటే గోరువంక
కడకొంగుతో కట్టుపడక, ఆ ఆ… కడకొంగుతో కట్టుపడక
గోరింట పూసింది… గోరింక కూసింది
కోరిందిలే రామచిలక… కోరిందిలే రామచిలక
నే తీర్చనా తీపి అలకా… ఆ ఆ, నే తీర్చనా తీపి అలకా
Gorinta Poosindi song is from the & English - Khaidi movie.
Gorinta Poosindi song was sung by S P Balasubramanyam, Susheela.
Gorinta Poosindi song lyrics were written by Veturi Sundararama Murthy.
Gorinta Poosindi song music was composed by Chakravarthy.