
| Movie Name | Jetty |
|---|---|
| Director | SUBRAHMANYAM PITCHUKA (SUBBU) |
| Star Cast | KRISHNA, NANDITHA SWETHA |
| Music | Karthik Kodakandla |
| Singer(s) | Anurag Kulkarni, Sunitha |
| Lyricist | Chandra Bose |
| Music Label | Lahari Music | T-Series |
హొయ్యా హొయ్యా హొయ్యా, జోర్సే
ఎల్లెల్ల ఎల్లెల్ల ఓ భేరి ఎల్లా
ఎల్లెల్ల ఎల్లెల్ల ఓ భేరి ఎల్లా, ఓ ఓ
ఓలెస్సో ఓ హ్మ్ హ్మ్ హ్మ్
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా సెయ్యమ్మా, ఆఆ ఆ
ఆటుపోటుల్లోనే ఆటుపోటుల్లోనే… ఆటపాటలంట హైలెస్సా
అలల కౌగిట్లోనే అలల కౌగిట్లోనే… అలుపే తీరేనంట హైలెస్సా
ఉప్పొంగి పొయేటి ఉప్పెనలో… మేము ఊయలూగేమంట హైలెస్సా
ఉబికి వచ్చే మా సెమటనీటితోటి… ఉప్పునీరు ఇంకా ఇంకా ఉప్పయిందట
ఓ ఓ హైలెస్సా హైలెస్సో హైలెస్సా
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా సెయ్యమ్మా, ఆఆ ఆ
సిరుసేప వలలోన పడుతుందో ఏమో
సొరసేప నోట్లోన పడిపోతామేమో
ఇది భయమెరుగని ఎనుతిరగని
తుది తెలియని పయనం
ఇది బతికేందుకు జలజలమని మరణముతో చలనం
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా సెయ్యమ్మా, ఆఆ ఆ
హొయ్యా హొయ్యా హొయ్యా, హైలెస్సా
ఎల్లెల్ల ఎల్లెల్ల ఓ భేరి ఎల్లా
పాపరా పడ్డాది పరిగే పడ్డాది పండుగప్ప పడ్డాది హోలెస్సా
మెత్తడి సిక్కింది ముచ్చంగి సిక్కింది మారువం సిక్కింది హోలెస్సా
నీటిగుళ్ల దరకందేంది హోలెస్సా, యేటి బళ్ళో తేయుందేంది హోలెస్సా
కరునిత్తుంది కాటెత్తుంది తోసేత్తుంది మోసేత్తుంది
కడలి అంటే కన్నతల్లి హోలెస్సా
ఎల్లొత్తానంటూ సెప్పేసినాడు మళ్లొచ్చేదాకేదో ఆరాటం
నీళ్ళల్లో తేలి దీపాలైనాము అల్లాడిపోతోంది మా పాణము
ఓఓ ఎంతో విలువైన ముత్యాలొద్దంట
పిల్లల సిరునవ్వే సిరులంట
ఎంతో అరుదైన రతనాలొద్దంట
పెండ్లాం కనుసూపే నిధులంట
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా సెయ్యమ్మా, ఆఆ ఆ
Gangamma song is from the Jetty movie.
Gangamma song was sung by Anurag Kulkarni, Sunitha.
Gangamma song lyrics were written by Chandra Bose.
Gangamma song music was composed by Karthik Kodakandla.