| Movie Name | Jetty (2021) |
|---|---|
| Director | Subrahmanyam Pitchuka |
| Star Cast | Maanyam Krishna, Nandita Swetha |
| Music | Karthik Kodakandla |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Shree Mani |
| Music Label | Lahari Music |
దూరం కరిగినా మది మౌనం కరుగునా
తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా
గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా
దూరం కరిగినా మౌనం కరుగునా
మౌనం కరిగినా అభిమానం కరుగునా
కొంటె కొంటె చూపులెన్నో రెప్ప గడప దాటుతున్నా
గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా
నా కలలే సెలవే
నీ కలలే కొలువే
మూగ కడలై పొంగె మనసే మూగ అలలే ఎగసెనే
మేఘమదిలో చినుకు వరసే కరిగి కురిసేదెపుడులే
చిన్ని చిన్ని అడుగులెన్నో నువు వెళ్ళే దారిలోనా
మధ్యానున్న అడ్డుగీత దాటలేనిదేనా
నీ పిలుపే మధురం
నీ తలపే కథనం
తేనె ఉనికే ఏది అంటే పూవు ఎదలో స్థానమే
నాకు ఉనికే ఏది అంటే నువ్వు నడిచే తీరమే
కొత్త కొత్త రోజులన్నీ కాలమల్లి జల్లుతున్నా
నువ్వు నేను అందులోన రేయి పగలమేనా