
| Movie Name | Mr. Kalyan |
|---|---|
| Director | Pandu |
| Star Cast | Maanyam Krishna, Archana |
| Music | Sukku |
| Singer(s) | Sukku |
| Lyricist | Sukku |
| Music Label | Tips Telugu |
ఎవ్వరే పువ్వులా నవ్వులేవో జల్లి
వెళ్ళిపోతే కిందపడ్డ నేను సొమ్మసిల్లి
ఎవ్వరే పువ్వులా నవ్వులేవో జల్లి
వెళ్ళిపోతే కిందపడ్డ నేను సొమ్మసిల్లి
సూదిలా గుచ్చుకుంది కంటిచూపు నన్నే
సూటిగా చెప్పమంది వదులుకోనని
నీడలా మారిపోయి వెంటపడ్డ నేనే
జిన్నులోన రమ్ము మిక్సు చేసి
ఫుల్లుగేసినట్టు ఉందిలేలోన నా పని
నీ నడకలో ఉంది జాతీయపక్షి నెమలి
ఆ సొగసునే నన్ను జాతీయం చెయ్యమంది
నీ పలుకులో ఉంది వేవేల పాల కడలి
ఆ పాలపై నన్ను ఓలలాడమంటూ ఉంది
కన్ను కొట్టినా నువ్వు కాలు దువ్వినా
సంధికే మొగ్గుతోంది గుండె ఎందుకో
కౌగిలించినా నువ్వు కత్తి దూసినా
రెంటికి పెద్దగా బేధమేమీ కానరాదే
నీ ఏటవాలు చూపు ఏటగాడిలాగా ఉంది
నా మనసుపైన ప్రేమ బాణాలు వేస్తూ ఉంది
నీ మాట జాజిమల్లె తోటలాగ మత్తుగుంది
నా వయసులోన ఎన్ని కోణాలు చూపుతుంది
ఆశలో నువ్వే నా శ్వాసలో నువ్వే
అమ్మతోడు ఎంతో ప్రేమ ఉంది నమ్మవే
ఊపిరుండగా నీ ఊసు విడువనే
గుండె గూటిలోకి వచ్చి కాలు పెట్టవే
Evvare Puvvula song is from the Mr. Kalyan movie.
Evvare Puvvula song was sung by Sukku.
Evvare Puvvula song lyrics were written by Sukku.
Evvare Puvvula song music was composed by Sukku.