
| Movie Name | Chanti (1992) |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Venkatesh, Meena |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music Telugu |
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
వేసే పూలబాణం… పూసే గాలిగంధం
పొద్దే లేని ఆకాశం… హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట
న్యాయమా ధర్మమా..!
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు
నింగిలో ఆగునా..!
చలిమర గదులలో… సుఖపడు బతుకులు
వేసవే కోరునా..!
అలికిన గుడిసెల… చలువల మనసులు
మేడలో దొరుకునా..!
అందాల మేడల్లోనే… అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే… మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు… ఇలలో ఉన్న హరివిల్లు
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
వేసే పూలబాణం… పూసే గాలిగంధం
పొద్దే లేని ఆకాశం… హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
జలజల పదముల… అలజడి నదులకి
వంత నే పాడనా..!
మిలమిల మెరిసిన… తళతళ తారలు
నింగినే వీడునా..!
చెరువుల కడుపున… విరిసిన తామర
తేనెలే పూయునా..!
మిణుగురు పురుగుల… మిడిమిడి వెలుగులు
వెన్నెలై కాయునా..!
ఏ గాలి మేడల్లోనో… దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలోనే నే కన్నా
గోదారమ్మ పరవళ్ళు… తెలుగింటమ్మ తిరునాళ్ళు
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
వేసే పూలబాణం… పూసే గాలిగంధం
పొద్దే లేని ఆకాశం… హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు… ఏవేవో రాగాలు
Ennenno Andalu song is from the Chanti movie.
Ennenno Andalu song was sung by S P Balasubramanyam, Chitra.
Ennenno Andalu song lyrics were written by Veturi Sundararama Murthy.
Ennenno Andalu song music was composed by Ilayaraja.