
| Movie Name | Idiot (2002) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Ravi Teja, Rakshita |
| Music | Chakri |
| Singer(s) | Kousalya |
| Lyricist | Kandikonda |
| Music Label | Aditya Music |
ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి… ఓ చంటి ఐ లవ్‌యు రా
నిన్నే తలచీ నన్నే మరిచా… ఓ కన్నా ఐ లవ్‌యు రా
కను రాల్చే కన్నీరువో… నను చేరే పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
కన్నులలోనా వెన్నెలలోనా… నీరూపు తోచి
ఊహలలోనా ఊసులలోనా… నీ ఆశలే, నాలో నీ బాసలే
తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వానా
ఆనందమై నాలో అనుబంధమై… నీ ప్రేమ నను చేరి మురిపించెరా
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
ఏయ్, ఏంటలా చూస్తున్నావ్,
సిగ్గేస్తుంది దగ్గరికి రావొద్దు… ప్లీజ్ చంటి..! నిన్నే అరె
ఉదయించే అరుణం నేనై… నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై… నినుతాకనా, నీలో సడిచేయనా
పనిచేస్తే పక్కన చేరి… సందడి చేస్తు గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ… నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై… నీ ప్రేమ కలలెన్నో పండించేరా
ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి… ఓ చంటి ఐ లవ్‌యు రా
నిన్నే తలచీ నన్నే మరిచా… ఓ కన్నా ఐ లవ్‌యు రా
కనురాల్చే కన్నీరువో… నను చేరే పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
చంటీ..! ప్లీజ్… హహ్హాహ్హా, ఛీ
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Ee Roje Telisindi song is from the Idiot movie.
Ee Roje Telisindi song was sung by Kousalya.
Ee Roje Telisindi song lyrics were written by Kandikonda.
Ee Roje Telisindi song music was composed by Chakri.