
| Movie Name | & English - Mutyala Muggu |
|---|---|
| Director | Bapu |
| Star Cast | Sreedhar, Sangeeta, Rao Gopal Rao |
| Music | KV Mahadevan |
| Singer(s) | V Ramakrishna |
| Lyricist | C Narayana Reddy |
| Music Label | Saregama Music |
ఏదో ఏదో అన్నది… ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది… కొత్త పెళ్లి కూతురు
ఏదో ఏదో అన్నది… ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది… కొత్త పెళ్లి కూతురు
ఒదిగి ఒదిగి కూచుంది… బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది… మరి మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై… వేయి కనులు కావాలి
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
ఏదో ఏదో అన్నది… ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది… కొత్త పెళ్లి కూతురూ
నింగిలోని వేలుపులు… ఎంత కనికిరించారో
నిన్ను నాకు కానుకగా… పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో… పూల పాన్పు వేశారు
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
ఏదో ఏదో అన్నది… ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది… కొత్త పెళ్లి కూతురు
ఆఆ ఆ ఆ, మ్ మ్ మ్ మ్
Edo Edo Annadi song is from the & English - Mutyala Muggu movie.
Edo Edo Annadi song was sung by V Ramakrishna.
Edo Edo Annadi song lyrics were written by C Narayana Reddy.
Edo Edo Annadi song music was composed by KV Mahadevan.