
| Movie Name | CLAP |
|---|---|
| Director | Prithivi Adithya |
| Star Cast | Aadhi, Aakanksha Singh |
| Music | Ilayaraja |
| Singer(s) | Karthik |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Lahari Music | T-Series |
Chinna Maata Paiki Raada Lyrics in Telugu
చిన్న మాట పైకి రాదా
ఎవరికోసం వారేనా
ఉన్న మాట బైటపడదా
చివరి దాకా ఇంతేనా
నింగిలాంటి గుండెలో
వెన్నెలాగవలెనా..?
ఓ మేఘమై… నీ మౌనమే
మోగుతుంటే లోనా
చిన్న మాట పైకి రాదా
ఎవరికోసం వారేనా
చేరువై దూరమా… పేరుకే చేరాలా
గాలినే ఇంటిలో… గోడలా చెయ్యాలా
చూపులే ఓదార్పు… ఊపిరే జోలాలి
జ్ఞాపకాలీలోపు ఊసులై రావాలి
పనులు బరువైన చోట
పలుకు గడి దాటలేదా
అడుగు పడలేని చోట
అడగడము వీలు కాదా
దేనికో ఏమిటో తేల్చుకో
చిన్న మాట పైకి రాదా
ఎవరికోసం వారేనా
వేకువ చీకటి… ఊరికే మారాలా
కాలమే దారిగా… జీవితం సాగాలా
వేరుగా వేరేగా… మోయకే ఆ భారం
కొంతలో కొంతైనా… వంచితే ఏం నేరం
వెలితి కరగాలి నేడు
వెలుగు కురవాలి మళ్ళీ
ఒకరికొకరైన జంట
ఒకటి కావాలి వెళ్ళి
శ్వాసలో శ్వాసగా మారగా
చిన్న మాట పైకి రాదా
ఎవరికోసం వారేనా
Chinna Maata Paiki Raada song is from the CLAP movie.
Chinna Maata Paiki Raada song was sung by Karthik.
Chinna Maata Paiki Raada song lyrics were written by Ananth Sriram.
Chinna Maata Paiki Raada song music was composed by Ilayaraja.