
| Movie Name | Prema Deshapu Yuvarani |
|---|---|
| Director | Sai Suneel Nimmala |
| Star Cast | Yamin Raaz, Viraat Karthik, Priyanka Rewri |
| Music | Ajay Patnaik |
| Singer(s) | Sudheer Garapati |
| Lyricist | Sai Suneel Nimmala |
| Music Label | Tips Telugu |
రెక్కలొచ్చి ఎగిరినట్టు
గుండెపట్టి లాగినట్టు
అనిపిస్తుందే
మది పులకిస్తుందే
పూల జల్లు కురిసినట్టు
పండగేదో జరిగినట్టు
కలవరమైందే
ఈ మైమరపేందే
నింగిలోని చందమామ నేలపై
ఇలా అడుగులేస్తూ నడుచుకుంటూ
టెన్ టు ఫైవ్ వెళుతుందలా
చల్లగాలి తాకినాది వెచ్చగా ఇలా
మైకమేదో కమ్ముకుంది నా లోపల
బంగారం బంగారం
నా గుండెకేదో కొత్త సంబరం
బంగారం బంగారం
నా కంటిచూపు తాకే అంబరం
మెరుపు మెరిసినట్టుగా
ఉరుము ఉరిమినట్టుగా
గుండె ఝల్లుమన్నదేమిటో
శ్వాస ఆగినట్టుగా
ద్యాస మరిచినట్టుగా
వింతమార్పులన్ని ఎందుకో
నిన్నలా నేను లేనులే
కొత్త లోకమేదో చూసినాను
కలయా నిజమా
కమ్మనీ నాలో కవితలే
నిన్ను చూడగానే పుట్టుకొచ్చే
చెలియా సఖియా
బంగారం బంగారం
నిన్ను దేవతల్లే చూసే ఈ క్షణం
బంగారం బంగారం
ఇక చూసి మారే నాలో వాలకం
మాయ చేసినావే… మంత్రమేసినావే
ఉన్నపాటుగా ఊపిరై… నీ అంద సవ్వడేమో
పుడమి తాకగానే మనసు పరవశించే ఊయలై
ఎప్పుడూ నాకు తోచలే
కొంటె సందడేమో చేసినావు
వరమా టెన్ టు ఫైవ్ కనుమా
ఉప్పెనై నన్ను ముంచెలే
చిన్ని నవ్వుతోటి ఒక్కసారి మనసా వినుమా
బంగారం బంగారం
నా నుదిటి రాత మారే సంతోషం
బంగారం బంగారం
ఈ జన్మకింక నువ్వే మందారం
Bangaram song is from the Prema Deshapu Yuvarani movie.
Bangaram song was sung by Sudheer Garapati.
Bangaram song lyrics were written by Sai Suneel Nimmala.
Bangaram song music was composed by Ajay Patnaik.