
| Movie Name | Ala |
|---|---|
| Director | Sarat Palanki |
| Star Cast | Bhargav Kommera, Shilpika, Malavika |
| Music | Srinivasa Sarma Rani |
| Singer(s) | Karthik |
| Lyricist | Sai Kiran |
| Music Label |
అవునా నేనా… ఎటో వెళ్ళిపోతున్నానా
అదే లోకమంటున్నానా… అరె ఏంటి ఇలా..!
ఏనాడైనా ఇలా ఇంత ఆనందాన… ప్రపంచాన్ని ఊహించానా..!
ఇదేం మాయారా..!
ఎన్నడూ నన్నిలా చూడనేలేదుగా… బహుశా ఇపుడే కదిలానా…
పదపదమన్నది ఈ మది… అసలు పరుగాపదే అది
కడలి అనుకోదు కదా… ఈ కధని ప్రాణం…
కుదురుగ ఈ క్షణం అని… నిలబడని తొందరైనది…
మనసునసలెప్పుడెలా చేరెను ఈ భావం…
అవునా నేనా… ఎటో వెళ్ళిపోతున్నానా
అదే లోకమంటున్నానా… అరె ఏంటి ఇలా..!
నేవిన్నవి, అనుకున్నవి… తనలా ఇలా ఎదురైనవో
నా గుండెలో ఈ అలజడి… ఆ సంగతే చెబుతున్నదో…
ఆ కళ్ళలో చెక్కిళ్ళలో… మెరిసింది ఓ మెరుపేందుకో…
అది మెల్లగా, చిరు జల్లుగా… నను చల్లగా తడిపేందుకో..
ఇన్ని వింతలొచ్చి ఒక్కసారిగా… కళ్ళముందు చేరుకుంటే
కంటిపాపకు ఇబ్బందే…
వేల అందమైన ఆశలన్ని… నన్ను దాటి ముందుకొచ్చి…
ఉన్న మాట చెప్పనందుకే…
పదపదమన్నది ఈ మది… అసలు పరుగాపదే అది
కడలి అనుకోదు కదా… ఈ కధని ప్రాణం…
కుదురుగ ఈ క్షణం అని… నిలబడని తొందరైనది…
మనసునసలెప్పుడెలా చేరెను ఈ భావం…
అవునా నేనా… ఎటో వెళ్ళిపోతున్నానా
అదే లోకమంటున్నానా… అరె ఏంటి ఇలా..!
Avuna Nena song is from the Ala movie.
Avuna Nena song was sung by Karthik.
Avuna Nena song lyrics were written by Sai Kiran.
Avuna Nena song music was composed by Srinivasa Sarma Rani.