
| Movie Name | & English - Dharma Kshetram |
|---|---|
| Director | Kodandarami Reddy |
| Star Cast | Balakrishna, Divya Bharthi |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫళంగా
బంగారం పిచ్చుకా… బాగోతం పెంచకా
నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా… గారం చూపించక
బండారం బైటెయ్యంగా
బాగుందో బొత్తిగా… బలవంతం పెట్టక
బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా… పొలిమేరే తెంచగా
పొంగుల్లో పొలమారంగా
మరేంచేస్తానే చెంగు అలా చిందెయ్యంగా
ఇదే సందంటూ… చేతబడి చాల్లే ఇంక
మరీ స్వాతంత్రంగా మహా బాహాటంగా
అలా జెండాలా ఎగరెయ్యంగా
అరెరెరె ఇంక, అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
ఏకాంతం సాక్షిగా… ఏమాత్రం దాచక
ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా… ఆశంతా తీర్చగా
వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా… ఉండొద్దా ఓపిక
ఆపొద్దే నిష్టూరంగా
చెప్పిందే చెప్పక… వింటుందా దప్పిక
చంపొద్దే చాదస్తంగా
చమత్కారాలు కారాల విడ్డూరంగా
అలా వారాలూ వర్జాలూ వద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా
మొరాయిస్తావే మోహనరంగా
అరెరెరె ఇంక, ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరె, ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా, హ్హ
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
Are Inka Janka Jinka song is from the & English - Dharma Kshetram movie.
Are Inka Janka Jinka song was sung by S P Balasubramanyam, S Janaki.
Are Inka Janka Jinka song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Are Inka Janka Jinka song music was composed by Ilayaraja.