| Movie Name | Pavitra Bandham (1996) |
|---|---|
| Director | Muthyala Subbaiah |
| Star Cast | Venkatesh, Soundarya |
| Music | M M Keeravani |
| Singer(s) | K J Yesudas |
| Lyricist | Sirivennela Sitarama Sastry |
| Music Label |
కార్యేషు దాసి… కరణేషు మంత్రి…
భోజ్యేషు మాత… శయనేషు రంభ…
అపురూపమైనదమ్మ ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా…
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా… జీవితం అంకితం చేయగా…
అపురూపమైనదమ్మ ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా…
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై… బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆస్తిలో… సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా… ఏ నోము నోచినా…
ఏ స్వార్దము లేని త్యాగం… భార్యగా రూపమే పొందగా…
అపురూపమైనదమ్మ ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా…
కలిమిలేములన్నీ ఒకే తీరుగా… కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం… వెలే వేసినా…
విడిచి పోని బంధం… తనై ఉండగా…
సహధర్మచారిణి… సరిలేని వరమణి..
సత్యాన్ని కనలేని నాడు… మోడుగా మిగలడా పురుషుడు…
అపురూపమైనదమ్మ ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా…
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా… జీవితం అంకితం చేయగా…
కార్యేషు దాసి… కరణేషు మంత్రి…
భోజ్యేషు మాత… శయనేషు రంభ…
Apurupamainadamma Aadajanma song is from the Pavitra Bandham movie.
Apurupamainadamma Aadajanma song was sung by K J Yesudas.
Apurupamainadamma Aadajanma song lyrics were written by Sirivennela Sitarama Sastry.
Apurupamainadamma Aadajanma song music was composed by M M Keeravani.