
| Movie Name | Sravan Diamond |
|---|---|
| Director | Sravan diamond |
| Star Cast | Aravind, Nithu Queen |
| Music | Bharath Mekala |
| Singer(s) | Sravan diamond |
| Lyricist | Sravan Diamond |
| Music Label |
విడిచిపెట్టకే నన్నిలా
బాధపెట్టకే మనసుల
తోడుంటనే నీ నీడలా
మన్నించి ప్రేమించవే
అందమైన ఓ జాబిలమ్మ
అందానికే నువ్వు రూపమమ్మ
నీ అందానికే నేను బానిసనోయమ్మా
దూరాన ఉన్న చందమామ
నా దరికే చేరవు ఎందుకమ్మ
పొద్దుగూకే రాలే చుక్కను నీనమ్మా
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
చితిలోన నేను కాలుతున్ననే
జాలిగా నువ్వు నన్ను చూడక
దగ్గరికి వచ్చి మంటలార్పరాదే
నుదుటిపై రాతవైపోవే
చేతిలోన గీతవైపోవే
ఉన్న ప్రాణం అంతా నీదే
నా గుండె చప్పుడై పోవే
నా దరికి చేరే దారే మరువకే
కట్టెలపై నున్న చంపకే
నువ్వు ఎంత కాదన్న
నువ్వే నా ప్రాణమే
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
అమ్మ నాన్న కంటే
నిన్ను ఎక్కువగా నమ్మానే
నన్ను చూసి తూకానికి
అమ్మేసి వెళ్లిపోయావే
కిందేసేటి ముద్దను నేను
నువ్వు ఎక్కడో ఇన్నేళ్లు
రాయె రాయే ఓ సందమామ
కింద గుక్కపెట్టి నేను ఏడుస్తున్న
నువ్వుంటే నా బ్రతుకు
నీతోనే టెన్ టు ఫైవ్ నా ప్రాణం
ఇంద్రధనస్సులా మారిపోనా
కక్షతో చూడకు ప్రేమతో నువ్ చూడు
జీవితమే నాతో పంచుకోవా
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
నీ మదిలో నన్ను మరువకే
నా మదిలో నువ్వు తప్ప
ఎవరు లేరు నన్ను నమ్మవే
నువ్వు నమ్మవెందుకే
నా ప్రాణం పోతుంది ఓసారి చూడు
కనికరించి జాలి పడవే
చిమ్మ చీకట్లో ఉన్ననే నేను
దీపమై నువ్వు వెలుతురు తెస్తివే
నువ్వేలే నా జీవం
నువ్వు లేని నా లోకం
అంధకారపు శూన్యమేలే
నా ప్రాణం పోతున్న నీ వెంటే వస్తున్న
చివరి వరకు నీతో తోడు ఉంట
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
అందమైన ఓ జాబిలమ్మ
అందానికే నువ్వు రూపమమ్మ
నీ అందానికే నేను బానిసనోయమ్మా
దూరాన ఉన్న చందమామ
నా దరికే చేరవు ఎందుకమ్మ
పొద్దుగూకే రాలే చుక్కను నీనమ్మా
Andamaina O Jabilamma song is from the Sravan Diamond movie.
Andamaina O Jabilamma song was sung by Sravan diamond.
Andamaina O Jabilamma song lyrics were written by Sravan Diamond.
Andamaina O Jabilamma song music was composed by Bharath Mekala.