Amma Ani Arachina Song Lyrics - Panduranga Mahatyam

Amma Ani Arachina Song Lyrics: Amma Ani Arachina is a Telugu song from the film Panduranga Mahatyam starring NTR, Anjali Devi, B Saroja Devi, directed by Kamalakara Kameswara Rao. "Amma Ani Arachina" song was composed by T V Raju and sung by Ghantasala. Lyrics were written by Samudrala Jr.

Amma Ani Arachina Song Details

Movie NamePanduranga Mahatyam
DirectorKamalakara Kameswara Rao
Star CastNTR, Anjali Devi, B Saroja Devi
MusicT V Raju
Singer(s)Ghantasala
LyricistSamudrala Jr
Music Label

Amma Ani Arachina Song Lyrics in Telugu

అమ్మా, ఆ ఆఆ ఆ

నాన్నా, ఆ ఆఆ ఆ

అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

పదినెలలు నను మోసి… పాలిచ్చి పెంచి

మది రోయక నాకెన్నో… ఊడిగాలు చేసినా

ఓ తల్లీ నిన్ను నలుగురిలో… నగుబాటు చేసితి

తలచకమ్మ తనయుని… తప్పులు క్షమియించవమ్మా

అమ్మా, అమ్మా

దేహము, విజ్ఞానము.. బ్రహ్మోపదేశమిచ్చి

ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని

కనుగానని కామమున… ఇలువెడల నడిపితీ

కనిపిస్తే కన్నీళ్ళతో… కాళ్ళు కడుగుతా నాన్నా

నాన్నా, నాన్నా

మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా

నీమాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా

మాతా పిత పాద సేవే

మాధవసేవేయని మరువనమ్మా

మాతా పిత పాద సేవే

మాధవసేవేయని మరువనమ్మా

నన్ను మన్నించగ రారమ్మా

అమ్మా, అమ్మా

అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

అమ్మా ఆలకించవేమమ్మా

అమ్మా అమ్మా అమ్మా అమ్మా

ఏ పాదసీమ కాశీప్రయాగాది

పవిత్ర భూముల కన్న విమలతరము

ఏ పాదపూజ రమాపతి

శరణాబ్జపూజలకన్ననూ పుణ్యతమము

ఏ పాదతీర్ధము పాపసంతాపాగ్ని ఆర్పగా

జారిన అమృతఝరమూ

ఏ పాదస్మరణ నాగేంద్రశయను

ధ్యానంబుకన్ననూ మహానందకరము

అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి

ఇహపరంబులకెడమై తపించువారి

కావగలవారు లేరూ… లేరు ఈ జగాన వేరే

నన్ను మన్నించి బ్రోవుమో… అమ్మా, నాన్నా

ఆ ఆ ఆఆ ఆ అమ్మా..! నాన్నా..!

Share this Song!

More Songs from Panduranga Mahatyam Movie

  1. Amma Ani Arachina Song Lyrics
  2. Jaya Krishna Mukunda Murari Song Lyrics

Amma Ani Arachina Song FAQ

What movie is Amma Ani Arachina song from?

Amma Ani Arachina song is from the Panduranga Mahatyam movie.

Who sang Amma Ani Arachina song?

Amma Ani Arachina song was sung by Ghantasala.

Who wrote Amma Ani Arachina song lyrics?

Amma Ani Arachina song lyrics were written by Samudrala Jr.

Who composed music for Amma Ani Arachina song?

Amma Ani Arachina song music was composed by T V Raju.