
| Movie Name | Allari Priyudu |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Rajasekhar, Ramya Krishna, Madhu Bala |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
Aho Oka Manasuku Nede Puttina Roju Lyrics In Telugu
అహో..! ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..! తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే… ఇదే, కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
అహో..! ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..! తన పల్లవి పాడే చల్లని రోజు
మాటా పలుకూ తెలియనిది
మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి
కవితలు రాసే మౌనమది, ఈ ఈ
రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరగని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది, ఈ ఈ
ఋతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకి దింపేది
తనే కదా వారధి… క్షణాలకే సారధి
మనస్సనేది…….
అహో..! ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..! తన పల్లవి పాడే చల్లని రోజు
చూపులకెన్నడు దొరకనిది
రంగూ రూపూ లేనిమది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నాలెన్నో చూపినదీ, ఈ ఈ
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కళగల నిండుమది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమదీ, ఈ ఈ
చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి
అమృతవర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి
మనస్సనేది…….
అహో..! ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..! తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే… ఇదే, కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
Aho Oka Manasuku Nede Puttina Roju song is from the Allari Priyudu movie.
Aho Oka Manasuku Nede Puttina Roju song was sung by S P Balasubramanyam, Chitra.
Aho Oka Manasuku Nede Puttina Roju song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aho Oka Manasuku Nede Puttina Roju song music was composed by M M Keeravani.