
| Movie Name | Cinema |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | ANR, Jayaprada, Jayasudha |
| Music | Ramesh Naidu |
| Singer(s) | Susheela |
| Lyricist | Devulapalli Krishna Sastry |
| Music Label |
ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ హ
ఆకులో ఆకునై… పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై… నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా, హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై… నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా, హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలనీ వీచు… చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు… సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు… తెరచాటు చేతినై
పరువంపు విడిచేడే… చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి… గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి… గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు… నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా… చింతలా వంతలా
ఈ తరణి వెర్రినై… ఏకసమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
Aakulo Aakunai song is from the Cinema movie.
Aakulo Aakunai song was sung by Susheela.
Aakulo Aakunai song lyrics were written by Devulapalli Krishna Sastry.
Aakulo Aakunai song music was composed by Ramesh Naidu.