
| Movie Name | Raja The Great Cinema |
|---|---|
| Director | Anil Ravipudi |
| Star Cast | Ravi Teja, Mehreen Pirzada |
| Music | Sai Kartheek |
| Singer(s) | Sai Kartheek |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
ఫ్లాష్ బ్యాకులో నన్ను ఇడియట్ అని తిట్టిన సోదరులారా..!
చూసుకోండి నా జూలియట్ ని కన్నులార
ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు ఇపుడు ఏమైంది..?
మా ఇంటి ముందు పోరి
దాని పేరు మంగళ గౌరీ
నా ఫస్ట్ లవ్వు స్టోరీ
ప్రేమించా చోరీ చోరీ
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో
కొట్టింది సైకిల్ బెల్లు
తట్టిందిరా నా దిల్లు
దాని గజ్జెలు ఘల్లు ఘల్లు
ఝిలు ఝిల్లుమన్నది ఒళ్లు
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
లవ్వు లెటరులెన్నో పెట్టా దాని పుస్తకాల్లో
చదువేమో సెకండ్ ఇంటర్
నాకు మీసాలప్పుడే ఎంటర్
ఇక ముదిరే లోపే మ్యాటర్
చెడగొట్టినవురా పీటర్
నా ఫేసుకి లవ్వు వేస్ట్ అన్నావు
ఎన్నీయలో ఎన్నీయలో
ఇప్పుడు నీ ఫేసెక్కడ పెట్టుకుంటావ్
ఎన్నీయలో, యాలో
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
లక్కీ తోటే లక్కు కలిసొచ్చింది జిందగీలో
బి.కామ్ లోన రోజా
తెరిచింది లవ్ దర్వాజా
యమ కామ్ గుండె రాజా
మోగించేయ్ బ్యాండు బాజా
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
సారు పడ్డాడయ్యో
రెండో సారి మళ్ళి ప్యారులో
అంటింది సెంటు సోకు
మారింది ఫ్రంటు బ్యాకు
తెచ్చాడు శీను బైకు
తిరిగాము సినిమా పార్కు
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
ముచ్చట్లే ఎన్నో ఆడినాము
మేము ల్యాండు ఫోన్లో
కట్ చేస్తే పెళ్లి సీను
వరుడెమో దోస్తు శీను
విరిగింది బ్యాకు బోను
మిగిలింది నాకు వైను
చాటుగా నన్ను ఛీటింగు
చేసినవెన్నీయాలో ఎన్నీయాలో
ఈ స్టన్నింగ్ బ్యూటీ మాటేమంటావ్
ఎన్నీయల్లో యాలో
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
లక్కీ తోటే లక్కు కలిసొచ్చింది జిందగీలో
మనమేమో సూపర్ హిట్టు
మన ప్రేమ కథలు ఫట్టు
మా అమ్మకొచ్చే డౌటు
తట్టాము శాస్త్రి గేటు
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
హస్తరేఖాలెన్నో మస్తుగ చూసే బూతద్దాల్లో
పంచాంగం ఓపెన్ చేసి
ఏవేవో లెక్కలు వేసి
చూసాడు గురుడు రాసి
కుజ దోషం కన్ఫామ్ చేసి
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
అసలు కన్య యోగం లేదన్నాడు నా తలరాతలో
రాసాడు జాతక చక్రం
తోసాడు పాతిక ఎకరం
చేసాడు యజ్ఞం యాగం
నా పైసల్ మొత్తం ఆగం
స్వైపింగ్ చేసి లక్షలు
నొక్కినవెన్నియాలో ఎన్నీయాలో
గ్రహాలు కక్షలు తప్పి
సక్కని సుక్కని దింపే నా ఒళ్ళో
ఎన్నీయాలో ఎన్నీయాలో ఎన్నీయాలో
లక్కీ తోటే లక్కు కలిసొచ్చింది జిందగీలో
Yenniyalo Yenniyalo song is from the Raja The Great Cinema movie.
Yenniyalo Yenniyalo song was sung by Sai Kartheek.
Yenniyalo Yenniyalo song lyrics were written by Kasarla Shyam.
Yenniyalo Yenniyalo song music was composed by Sai Kartheek.