Movie Name | Return of The Dragon (2025) |
---|---|
Director | Ashwath Marimuthu |
Star Cast | Pradeep Ranganathan |
Music | Leon James |
Singer(s) | Deepak Blue |
Lyricist | Ramajogayya Sastry |
Music Label | Think Music |
సాంగ్ : ఎందుకే నన్నొదిలావు (Yendhukae Nannodhilaavu)
ఆల్బమ్ / సినిమా: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of The Dragon)
గాయకుడు: దీపక్ బ్లూ (Deepak Blue)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran),
రచన & దర్శకత్వం: అశ్వత్ మరిముత్తు (Ashwath Marimuthu)
మానసించినది ఇందుకేనా ఇదిగోమని
వెలివేసి పంపినావే వెళ్లిపోమని..
వేడుక జరిపేంతలోపే నీ రాకని
దూరం జరిగావే చెలియా వీడ్కోలని..
కన్న కలలు కన్నిరేనా ఆశలన్నీ చేజారేనా
గాయమైన ప్రేమకేమి బదులు చెప్పనే..
ప్రాణమింకా ఒంటరిదేనా నీకు నేను ఏమి కానా
అందమైన నా జీవితం గాడి తప్పేనే
ఎందుకే.. నన్నొదిలావు మనసంటూ ఉందా లేదా
ఎందుకే.. నన్నొదిలావు నే నమ్మలేకున్నా
ఎందుకే.. నన్నొదిలావు ఇది చూవుకు మించిన బాధ
ఎందుకే.. నన్నొదిలావు నరకం చూస్తున్నా..
నాకిది కావాల్సిందేలే నాకిది జరగాల్సిందేలే
నిన్ను నమ్మి చెడిపోయానే ప్రేమించడం నేరమే
దీపాన్ని చుట్టి తిరిగే మిణుగురుల బలి అయ్యానే
నీ మిల మిల మంటల కాలి బూడిదైతినే
తిరుగే భూమి మరి నిలిచి పోదా చెలి
నువ్వే జతగా లేనే లేని బతుకు ఎవ్వరి కోసమే
వెన్నెల వెలుగే లేని చిక్కటి శున్యం ఇది
కనుపాపల్లో శూలలు గుచ్చింది నీ మోసమే
ఎందుకే.. నన్నొదిలావు మనసంటూ ఉందా లేదా
ఎందుకే.. నన్నొదిలావు నే నమ్మలేకున్నా
ఎందుకే.. నన్నొదిలావు ఇది చూవుకు మించిన బాధ
ఎందుకే.. నన్నొదిలావు నరకం చూస్తున్నా..
అయ్యో అయ్యో ఎందుకే నన్ను వోదిలావు
నా కలలకు రెక్కలు కోసి దూరంగా విసిరావే
అయ్యో అయ్యో ఎందుకే నన్ను వోదిలావు
నా మనసును మసి చేసేసిన రాకాసి ప్రేమ నువ్వే