Movie Name | Shivaratri song (2025) |
---|---|
Director | ACTOR SATHISH |
Star Cast | ACTOR SATHISH |
Music | V V Naik |
Singer(s) | ACTOR SATHISH |
Lyricist | Nithin singer |
Music Label | DVS CREATION |
చిన్ననాటి నుండి పూజించినానురా శంకర..హ...
ఈ కళ్ళులేని జీవితాన్ని ఇచ్చవా ఈశ్వర..హ..
తనివి తీరా నిన్ను చూడాలని ఉంది పరమేశ్వర..హ
ఈ గుడ్డివాన్ని నీ దరికి చేర్చుకో శంకర...
నీ మాయలు మాకు తెలువదయ్యా
ధనము ఉన్నోనికే ధనము ఇస్తవయ్యా
మంచి వాళ్లను మాయం చేస్తావయ్య
చెడ్డ వాళ్లతో లోకం నింపుతావు
పాపాలు చేసే వాళ్ళకేమో ధనమిచ్చి దగ్గరకు తీసుకుంటావ్
బాధల్లో ఉండే నన్ను నువు పట్టించుకోకుండా పారిపోతావ్..
"ఏమాయర ఓ ఈశ్వర నన్ను చూసిపోర ఓ శంకర
నిన్ను చూడాలనుంది లింగేశ్వర, నన్ను కలిసిపోర ఓ జంగమ...
చరణం:
ఎంత మంది దేవుళ్ళు ఉన్న, ఎంతమంది స్వాములు ఉన్న
చిన్నాటినుండి నిను పూజించాను శంకరయ్య
నా వాల్లు అన్నమాట లేకుండా చేసవయ్యా..
ఎందరున్న ఏ తిరుగుతున్న ఒంటరి చేసావ్ ఓ లింగమయ్య
నాకే ఇంత బాధను ఇచ్చావా శివయ్య
నన్ను నీలో దాచుకోర ముక్కోటి ఈశ్వర
కట్టే కాలే వరకు నిన్ను పూజీస్తా లింగమయ్య
జాలి చూపి దర్శనమియ్యి కైలాసవాసుడ...
"ఏమాయర ఓ ఈశ్వర నన్ను చూసిపోర ఓ శంకర
నిన్ను చూడాలనుంది లింగేశ్వర, నన్ను కలిసిపోర ఓ జంగమ...
చరణం:
సృష్టిలోన జీవమునందు, నడిపించే నాథుడవయ్యా
నీ ఆజ్ఞ లేకుండా చిన్న చీమైనా కుట్టదు ఓ జంగమయ్య
చావు బతుకు నీకో ఆట, నచ్చినోడ్ని తీసుకుపోతావ్
నచ్చనోన్ని భూమ్మీద ఉంచి పదిమందిలోన పెద్ద చేస్తావయ్య
శివరాత్రి వస్తుందయ్యా ఓ.... ఆత్మలింగ
ఆ రోజన్న దర్శనమియ్యి జడల కంటుడా,
ఎన్ని ఉన్నా ఏమి లాభం బుగ్గ రాజేశ్వర
నిన్ను చూడలేని ఈ జన్మ నాకొద్దు ఓ.శంకర...
ఏమయ్యా ఓ శివయ్య నా కన్నీళ్ళు తుడిచిపోవయ్యా...
ఓ కాశీనాథ కరుణించవా, నా బాధలు అన్ని యాడబాపవ..||2