Yedakellavantu Song Lyrics - Anandam Ambaramaithe

Yedakellavantu Song Lyrics - Anandam Ambaramaithe
Yedakellavantu Song Lyrics: Yedakellavantu is a Telugu song from the film Anandam Ambaramaithe starring Prudhvi, Avanthika, Ch.Suresh, directed by Subbu Eranki. "Yedakellavantu" song was composed by Sri Krishna and sung by S P Balasubramanyam. Lyrics were written by Noojilla Srinivas.

Yedakellavantu Song Details

Movie NameAnandam Ambaramaithe
DirectorSubbu Eranki
Star CastPrudhvi, Avanthika, Ch.Suresh
MusicSri Krishna
Singer(s)S P Balasubramanyam
LyricistNoojilla Srinivas
Music Label

Yedakellavantu Song Lyrics in Telugu

యాడాకెళ్ళావంటూ ఏడుస్తున్నాదయ్యో… నీ పల్లె తల్లీ నీ కోసం

ఏనాడొస్తావంటూ ఎదురుచూస్తందయ్యో… నీ కన్నా తల్లీ నీ కోసం

నీ కన్నా తల్లీ నీ కోసం…

మా పల్లె పిల్లగాడా… దేశమొదిలినోడ

ఒకసారి ఇను నా మాటా…. పట్టరా నీ పల్లె బాట

పట్టరా నీ పల్లె బాట…

బాధానిండినా తల్లి గుండె… బరువు కాగా

సూడలేని కన్ను… చెమ్మగిల్లినాది

ఆశరేపిన సినుకు… ఆవిరయ్యిపోగా

చిగురు పట్టిన మాను… మోడుగా మారింది

ఊతమిచ్చిన ఊరు… ఊసు మరిచిపోగా…

ఎడిసి ఎడిసి బీడుగా మారింది…

మా పల్లె పిల్లగాడా… మమ్ము ఇడిసినోడా

ఒకసారి ఇను నా మాటా… ఆ ఆ… పట్టరా నీ పల్లె బాట

పట్టరా నీ పల్లె బాట…

యాడాకెళ్ళావంటూ ఏడుస్తున్నాదయ్యో…

నీ పల్లె తల్లీ నీ కోసం…

యేటి కోసారైనా ఊరు రారేమయ్యా…

కాటికి పొయేటి కన్నోళ్ల కనరయ్య…

అభిమానమడ్డొచ్చి అమ్మా నాన్నాలు మీకు…

అసలు ఇసయాలేవి సెప్పాకున్నారయ్యా…

భాగ్యనగరంలోన బంగారం ఉండొచ్చు… అమెరికా దేశంలో డాలర్లు పండొచ్చు

అంతకు మించిన ప్రేమాభిమానాలు… పల్లె తల్లి నీకు పంచె బహుమానాలు

పంచె బహుమానాలు…

మా పల్లె ఆడపడుసా… మమ్ము ఇడిసిన దాన

ఒకసారి ఇను నా మాట తల్లీ…

పట్టవా నీ పల్లె బాట…

యాడాకెళ్ళావంటూ ఏడుస్తున్నాదయ్యో…

నీ పల్లె తల్లీ నీ కోసం…

పల్లె దేశానికి పట్టుకొమ్మ… అన్నా పెద్దాల మాటలు

నీటి మూటలేనా…

ఎదిగిన పిల్లలు… ఎనకాకొస్తారంటూ ఎదురుచూసిన కళ్లే

కాయలు కాసేన…

నిచ్చనల్లే పల్లెనెక్కి ఎదిగినోడా… సచ్చిపోతన్నను సూడంగా రావేలా

మా పల్లె పిల్లగాడా… మమ్ము మరిసినోడా

ఒకసారి ఇను నా మాటా… అయ్యా ఆ ఆ…

పట్టరా నీ పల్లె బాట…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Anandam Ambaramaithe Movie

  1. Yedakellavantu Song Lyrics

Yedakellavantu Song FAQ

What movie is Yedakellavantu song from?

Yedakellavantu song is from the Anandam Ambaramaithe movie.

Who sang Yedakellavantu song?

Yedakellavantu song was sung by S P Balasubramanyam.

Who wrote Yedakellavantu song lyrics?

Yedakellavantu song lyrics were written by Noojilla Srinivas.

Who composed music for Yedakellavantu song?

Yedakellavantu song music was composed by Sri Krishna.