
| Movie Name | Aravindha Sametha (2018) |
|---|---|
| Director | Trivikram Srinivas |
| Star Cast | Jr. NTR, Pooja Hegde |
| Music | Thaman S |
| Singer(s) | Kailash Kher, Nikhita Srivalli & Penchal Das |
| Lyricist | Sirivennela Seetharama Sastry & Penchal Das |
| Music Label | Zee Music South |
Yeda Poyinado Lyrics in Telugu
ఏ కోనలో కూలినాడో
ఏ కొమ్మలో చేరినాడో
ఏ ఊరికో… ఏ వాడకో
యాడ బొయ్యాడో
రం రుధిరం… సమరం శశిరం
రం మరణం… గెలవం ఎవరం
యాడ బోయినాడో… యాడ బోయినాడో
సింతలేని లోకం… సూడబోయి నాడో
చారడేసి గరుడ పచ్చ కళ్లు వాల్చి
గరికపచ్చా నేలపైనే… సీమ కక్షా వేటు వేస్తే
రాలిపోయినాడో
రం రుధిరం.. సమరం శశిరం
రం మరణం… గెలవం ఎవరం
కట్టెలే సుట్టాలు… కాడు మన తలిదండ్రి
అగ్గి దేవుడే మనకు… ఆత్మబంధువుడంట
కాలవాగట్టూనా… నీ కాళ్లు కాలంగా
కాకి శోకము బోతిమే.. కాకి శోకము బోతిమే
నరక స్వర్గా అవధి దాటి
వెన్నామాపులు దాటీ, ఈ ఈ
విధియందు రారానీ
తదియందు రారానీ
నట్టింట ఇస్తరులు
నాణ్యముగా పరిపించీ
నీ వారు చింతా పొయ్యేరూ
నీ వారు దు:ఖ పొయ్యేరూ
మృత్యువు మూకుడు… మూసిన ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని
ఇంకని చెంపల పారే శోకం
తూకం వేసేదెవరని
కత్తుల అంచున.. ఎండిన నెత్తురు
కడిగే అత్తరు ఎక్కడని
ఊపిరాడనీ గుండెకు గాలిని
కబలం ఇచ్చేదెవ్వరనీ
చుక్కే లేని నింగీ.. ప్రశ్నించిందా వంగీ
ఏ కోనల్లో కూలినాడో… ఏ కొమ్మల్లో చేరినాడో
రం రుధిరం… సమరం శశిరం, రం రుధిరం
రం మరణం… గెలవం ఎవరం
హరోం హరీ, నీ కుమారులిచ్చిన భక్ష భోజనములు
రాగికానులు ఇరం విడిచి పరం జేరిన వారి పెద్దలకు పేరంటాలకు
మోక్షాదిఫలము శుభోజయము.
పద్నాలుగు తరాల వారికి మోక్షాదిఫలము కల్గును
శుభోజయము శుభోజయము.
Yeda Poyinado song is from the Aravindha Sametha movie.
Yeda Poyinado song was sung by Kailash Kher, Nikhita Srivalli & Penchal Das.
Yeda Poyinado song lyrics were written by Sirivennela Seetharama Sastry & Penchal Das.
Yeda Poyinado song music was composed by Thaman S.