
| Movie Name | & English - Maro Charitra |
|---|---|
| Director | K. Balachander |
| Star Cast | Kamal Haasan, Saritha |
| Music | M.S.Viswanathan |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పిడిన్న… హుహు, అర్ధం కాలేదా..? ఊఁ
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా అప్పిడియా..?
పెద్ద అర్ధం అయినట్టు, హహ
బాషలేనిది బందమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగ పువ్వునో… ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్ నీ రొంబ అలహారిక్కే…!!
ఆ, రొంబ అంటే..??
ఎల్లలు ఏవి వొల్లనన్నది
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
తొలి చూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను… అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పువ్వునో… ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
Ye Teega Puvvuno song is from the & English - Maro Charitra movie.
Ye Teega Puvvuno song was sung by S P Balasubramanyam, P Susheela.
Ye Teega Puvvuno song lyrics were written by Acharya Athreya.
Ye Teega Puvvuno song music was composed by M.S.Viswanathan.