
| Movie Name | Sakala Gunabhirama ( ) |
|---|---|
| Director | Srinivas Veligonda |
| Star Cast | VJ Sunny, Sree Tej, Ashima Narwal, Taruni |
| Music | Anudeep Dev |
| Singer(s) | Pradeep Kumar |
| Lyricist | SimhaChalam Maneela |
| Music Label | Aditya Music |
ఏ పొరపాటో… ఏమరపాటో
ఊహించని చిత్రం గీసే
ఏ తడబాటో… ఏ గ్రహపాటో
ఉరి అంచున వేలం వేసే
ఉనికిని చాటే ఆరాటం
ఊపిరి కోలాటం
ఏ ప్రశ్నకి బదులో తెలుసా
రేపటి పూటే పోరాటం
బ్రతుకులో జంజాటం
వినుమిణుగు మిణుగురులా
మెరిసే ఆశల ఉబలాటం
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
(ఆ దైవం ఆడించే జూదాలే కోరికలే)
నీ రాత మార్చే విధాతే లేడు
నీ వెంట నడిచే నీడే యమతాడు
గతముని తెగ తెంచిన
నిజముకి తలవంచిన
తొలకరి స్నేహం… తగువుతో విడిచి
ముసురున మునకే… తప్పే కదా
పలకని పైకం పరుపున పరిచి
యదసడి మరుపే ముప్పే కదా
రంగుల తెర లేపిన కాలం
వివరించదు కధనం
గుర్తించు నీ పాత్రని
ప్రేమను నటియించిన మాత్రం
నిలవదు ఏ బంధం
ఏ పుస్తకము చూపని
కథ రాసెను కదారా విధి
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
Ye Porapato song is from the Sakala Gunabhirama ( ) movie.
Ye Porapato song was sung by Pradeep Kumar.
Ye Porapato song lyrics were written by SimhaChalam Maneela.
Ye Porapato song music was composed by Anudeep Dev.