
| Movie Name | & English - Jayamundhi Bhayamela Manasaa |
|---|---|
| Director | Ranjith Pasam |
| Star Cast | Bharan Dandamudi, Saranya Sharma |
| Music | Kalyan Nayak |
| Singer(s) | SP Charan |
| Lyricist | Bhargava Karthik |
| Music Label | Sony Music South |
ఏ కష్టం నిన్నాపినా
ఈ స్నేహంతో దాటేయరా
నీ నేస్తాలే నీ ఆస్తిరా పదరా
భయం లేదు పోరా…
ఎందాకో ఏమిటో
ఈ మౌన సంఘర్షణా
ఇన్నాళ్ళు చూడనీ
ఈ వింత సంభాషణా
మాటా మాటా సావాసానా
మామూలే సోదరా
తప్పు ఒప్పు తూకం వేసి
చూసేంత వీలేదిరా
పోనీలే అనుకుంటే గొడవేదిరా
దూరంగా మిగిలేంత తగువేంటిరా
తాపీగా సరదాగా చిరునవ్వుతో సరి చేయరా
ఏ కష్టం నిన్నాపినా
ఈ స్నేహంతో దాటేయరా
నీ నేస్తాలే నీ ఆస్తిరా పదరా
భయం లేదు పోరా ||2||
నిన్నొది కదిలి ముగిసిన కధ
తిరిగి జతను అడగదు కద
దిగులు దేనికట..!
కనుల నీరు వృధా
నీ వలపు కలల చెలిమి అచట
నిను కలవగ తపన పడదా
ఇది తియ్యని వ్యధ కాదా..!
సాయంత్రాలే చాలన్నావో
వెన్నెల్లే తాకేదెలా
సాయాలేవి వద్దన్నావో
ఆ తీరం చేరేదెలా..!
ఏ రోజు ఒకలాగే విసిగించదే
ఏ రేయి ఒంటరిగా వదిలేయదే
మీ మాత్రం కలహాలు
మన మంచికే దిగులేలరా..!
ఏ దారి నినిన్నాపినా
ఓ సంచారి సాగాలిరా
నీ రేపంటూ నీకుందిరా పదరా
భయం లేదు పోరా…
ఏ దారి నినిన్నాపినా
ఓ సంచారి సాగాలిరా
నీ రేపంటూ నీకుందిరా పదరా
భయం లేదు పోరా
పో, పో… పోరరేయ్
Ye Kastam Ninnaapina song is from the & English - Jayamundhi Bhayamela Manasaa movie.
Ye Kastam Ninnaapina song was sung by SP Charan.
Ye Kastam Ninnaapina song lyrics were written by Bhargava Karthik.
Ye Kastam Ninnaapina song music was composed by Kalyan Nayak.