
| Movie Name | Anukoni Prayanam |
|---|---|
| Director | Venkatesh Pediredla |
| Star Cast | Dr. Rajendraprasad, Narasimharaju, Prema, Tulasi |
| Music | S Siva Dinavahi |
| Singer(s) | Shankar Mahadevan |
| Lyricist | Madhukiran Maddikunta |
| Music Label | Aditya Music |
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
రెప్పలే మోయలేని జ్ఞాపకాల
బరువే పెరిగి
చెంపపై జారిపోయే చెలిమే
చుట్టు చుట్టాలు లేకున్నా
నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా
ఓహో పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది
బాధైనా నవ్వైనా స్నేహమొకటే
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
ప్రేమగ నన్నే ఇలా తాకినా
అమ్మే తన కాదనేదెట్టా
ఏ కలా ఇన్నాళ్ళిలా లేదులే
నమ్మేదెలా ఈ నిజాన్నిట్టా..?
అర్ధం కాని భాషలోన రాసుకున్న జీవితాన్ని
అద్భుతంగ మార్చుతున్న అందమైన తోడుగానే
వెంటరాదు ఏదీ నీతో
నమ్ముతావో లేదో నువ్వు
ఎంత గొప్పవాడివైనా
మన్నుపోసి కప్పెత్తారు
అంటూ నాకే ఎన్నో చెప్పి
చెప్పకుండానే వెళ్లిపోయావా
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
Ye Kadhanu song is from the Anukoni Prayanam movie.
Ye Kadhanu song was sung by Shankar Mahadevan.
Ye Kadhanu song lyrics were written by Madhukiran Maddikunta.
Ye Kadhanu song music was composed by S Siva Dinavahi.