
| Movie Name | (Male) - Kanne Vayasu (1973) |
|---|---|
| Director | O S R Anjaneyulu |
| Star Cast | Lakshmi Kanth, Roja Ramani, Chandra Mohan |
| Music | Ch Sathyam |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Krishnamacharyulu Dasarathi |
| Music Label |
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ ఏఏ
ఏ దివిలో విరిసిన… పారిజాతమో
ఏ కవిలో మెరిసిన… ప్రేమగీతమో
నీ రూపమే… దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఏ ఏఏ
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
పాలబుగ్గలను లేతసిగ్గులు
పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో
ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేతసిగ్గులు
పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో
ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన
కాలి అందియలు ఘల్లుఘల్లుమన
రాజహంసలా రావే
ఏ దివిలో… విరిసిన పారిజాతమో
ఏ కవిలో… మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో… నీవై నిండిపోయెనే, ఏ ఏఏ
ఏ దివిలో… విరిసిన పారిజాతమో
ఏ కవిలో… మెరిసిన ప్రేమ గీతమో
నిదుర మబ్బులను… మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై… ప్రణయ రాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను… మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై… ప్రణయ రాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే
ఏ దివిలో… విరిసిన పారిజాతమో
ఏ కవిలో… మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ ఏ ఏఏ
ఏ దివిలో విరిసిన… పారిజాతమో
ఏ కవిలో మెరిసిన… ప్రేమ గీతమో
Ye Divilo Virisina Paarijathamo song is from the (Male) - Kanne Vayasu movie.
Ye Divilo Virisina Paarijathamo song was sung by S P Balasubramanyam.
Ye Divilo Virisina Paarijathamo song lyrics were written by Krishnamacharyulu Dasarathi.
Ye Divilo Virisina Paarijathamo song music was composed by Ch Sathyam.