| Movie Name | |
|---|---|
| Director | Balu Mahendra |
| Star Cast | Bhanu Chandra, Archana |
| Music | Ilayaraja |
| Singer(s) | S Janaki |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ
హొయ్ రే రీరే హొయ్యారె హొయ్
యమునా తీరే… హొయ్యారె హొయ్
యమునా ఎందుకె నువ్వు… ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్య తోటి కూడావా..?
యమునా ఎందుకె నువ్వూ… ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్య తోటి కూడావా
నల్లానల్లని వాడు… నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా… నలుపే నీకంటెనా
హొయ్ రే రీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
వెన్నంటి వెంటాడి… వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి… పెడతాడె చిచ్చూ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి… పెడతాడె చిచ్చూ
చల్లమ్మ బోతుంటె… చెంగట్టుకుంటాడే
(చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే)
దారివ్వకే చుట్టూ తారాడుతాడే
పిల్లా..! పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు అబ్బా ఏం పిల్లడే
హొయ్ రే రీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
ఆ ఆఆ ఆఆఆ ఆఆఅ ఆ ఆ
శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే
శృంగారరంగాన కడతేరినాడే
శిఖిపింఛమౌళన్న… పేరున్నవాడే
శృంగారరంగాన కడతేరినాడే
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడే
(రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడే)
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళీలోలుడు వాడే… ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే… చిలిపీ శ్రీకృష్ణుడూ
హొయిరే రీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
యమునా ఎందుకె నివ్వు
ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్యతోటి కూడావా
నల్లానల్లని వాడు నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా… నలుపే నీకంటెనా
హొయ్ రే రీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
Yamuna Enduke Nuvvu song is from the movie.
Yamuna Enduke Nuvvu song was sung by S Janaki.
Yamuna Enduke Nuvvu song lyrics were written by Acharya Athreya.
Yamuna Enduke Nuvvu song music was composed by Ilayaraja.