| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | Akhil Gandi, Ravali |
| Music | Madeen SK |
| Singer(s) | Spoorthi Jithender |
| Lyricist | Sravan Velmal |
| Music Label |
యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా
నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..?
నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి…
నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
రాత రాసిన బ్రహ్మదేవుడే… బ్రహ్మ ముడి వేస్తాడనుకుంటి
ఈ గీత గీసిన దేవుడెవ్వడో… ఇట్లెట్ల దూరమై ఉండబడితివి
కన్నీరుతోనే కలలుగంటి… కలలో కూడా కలిసి ఉంటి…
కనురెప్ప తెరవగానే కన్నీరైతి… కలిసేదెప్పుడని చింతబడితి…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
దూరాల తీరాలు… దుఃఖాల చెరువులు…
మిగిలిన ఊసులు… నీవే నా ఆశలు
భారాలే ఘోరాలై… గోడులై విలపిస్తి
తోడున్నవాడవు ఏడున్నవని చెప్పి…
నుదిటిన బొట్టువు నువ్వేనని… నొసలి పగిలే దాకా మొక్కితిని
నోచిన నోములు ఏమాయనో… ఏలు పట్టిన నువ్వు ఏడుంటివో
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
కలిపినా దేవుడు కనులెలా మూసెను…
కష్టాల శోకాలు మనకెందుకిచ్చాడు…
కనుచూపు పొరలల్లొ… నిండిన రూపమా
కబురైన పంపవా… నా ఇంటి దీపమా…
నువ్వు లేకుండా ఉండలేను… నీ భాష లేనిది బతకలేను
నీవెంటే నిండైన నేనుంటాను… లేకుంటే సచ్చిన శవమైతాను…
యాడ ఉన్నావో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా
నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..?
నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి…
నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
Watch యాడ ఉన్నవో యెన్నెల బావ వీడియో సాంగ్
Yadavunnadho Folk song is from the movie.
Yadavunnadho Folk song was sung by Spoorthi Jithender.
Yadavunnadho Folk song lyrics were written by Sravan Velmal.
Yadavunnadho Folk song music was composed by Madeen SK.