
| Movie Name | & English - Tholi Prema |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Varun Tej, Raashi Khanna |
| Music | Thaman S |
| Singer(s) | Armaan Malik |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
లవ్లీ లవ్లీ మెలొడీ ఏదో
మది లోపల ప్లే చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన
నిమిషములో అడుగేసా
కాలాన్నే (కాలాన్నే)
ఆపేసా (ఆపేసా)
ఆకాశాన్నే దాటేసా
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసిందా
ప్రేమ నా పైన
నా మనసే మనసే కనిపించిందా
కాస్త లేటైనా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా
దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజొస్తుందని
వేచి చూస్తున్నా
అరె ఎందరున్న అందమైన
మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న
చోటుల్లోకే నెట్టేశావుగా
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ పలుకే వింటూ… తేనెలనే మరిచాలే
నీ అలకే కంటూ… ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కోసం… కలల తెరే తెరీచాలే
నీ మెలుకువ కోసం… వెలుతురులే పరిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే
నీ రంగు నేనంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే
నీ రేయి నేనవుతా
నా పేరే పిలిచే అవసరమైనా
నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలై నేనై
నీకు తోడుంటా
అరె ఎందరున్న అందమైన
మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న
చోటుల్లోకే నెట్టేశావుగా, ఆ ఆ ఓ ఓఓ
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
Vinnane Vinnane song is from the & English - Tholi Prema movie.
Vinnane Vinnane song was sung by Armaan Malik.
Vinnane Vinnane song lyrics were written by Shree Mani.
Vinnane Vinnane song music was composed by Thaman S.