Movie Name | Satyabhama (2024) |
---|---|
Director | Suman Chikkala |
Star Cast | Kajal Aggarwal, Naveen Chandra |
Music | Sri Charan Pakala |
Singer(s) | M M Keeravani |
Lyricist | Chandrabose |
Music Label | Aditya Music |
వెతుకు వెతుకు వెతుకు
వెనుదిరగకుండా వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
వెనుకాడకుండా వెతుకు…
ఆశ కొరకు నిరాశలోనే వెతుకూ వెతుకు
కాంతి కొరకు నిశీధిలోనే వెతుకూ
పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ
కోల్పోయిన చోటే వెతుకూ, వెతుకు వెతుకూ
వెతుకు వెతుకు వెతుకు
వెళుతూ వెళుతూ వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
పడుతూ లేస్తూనే వెతుకు
ఆగేది తుది మజిలీ కాదు
అడుగేసి సాగాలీ
ఆపేది అవరోధం కాదు
ఆపైకి చేరాలి
లోకం ఔనన్నా కాదన్నా
లక్ష్యం ఛేదించాలి
సంద్రాలెన్నున్నా ముంచేలా
స్వేదం పొంగాలీ
నిజానిజాలను నీడల్లోనే వెతుకూ, వెతుకు
నిన్నటి అడుగుజాడల్లోనే వెతుకూ (వెతుకు)
రేపటికై నిన్నటిలోనే వెతుకూ, వెతుకు
జవాబుకై ప్రశ్నల్లోనే వెతుకూ, వెతుకు
పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ
కోల్పోయిన చోటే వెతుకూ, వెతుకూ వెతుకూ.