
| Movie Name | & English - Tulasi Cinema |
|---|---|
| Director | Boyapati Srinu |
| Star Cast | Venkatesh, Nayantara |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Venu & Sunitha |
| Lyricist | Bhaskarbhatla Ravikumar |
| Music Label | Aditya Music |
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా… బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
చీకట్లో సూరీడు… పొద్దున్నేమో జాబిల్లి
వచ్చాయి నువ్వే నవ్వంగ
నేలపై మేఘాలు… ఆకాశంలో గోదారి
చేరాయి నువ్వే చూడగా
వెన్నెలింత వేడిగా… ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా… బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
నా పేరే అనుకుంటూ… నీ పేరు నేను రాసానే
నా రూపే అనుకుంటూ… నీ రూపు నేను గీసానే
తియ్యంగా తీవ్రంగా… ఎదో ఎదో అవ్వంగా
ప్రేమంటూ కానే కాదంట
మెత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా
మన జంటే కనిపెట్టాలటా
వెన్నెలింత వేడిగా… ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగ… బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
గాలైన నిను చుడితే… ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైనా నిను తడితే… ఎదలో అసూయ పెరిగిందే
ఘాడంగా గర్వంగా… జోడి మనమే కట్టంగా
ఏడే జన్మలు సరిపోవంటా
దేవుళ్ళే మనకోసం… పగలు రేయి పనిచేసి
ఎన్నో జన్మలు సృష్టించాలట
వెన్నెలింత వేడిగా… ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగ… బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
Vennelintha Vediga song is from the & English - Tulasi Cinema movie.
Vennelintha Vediga song was sung by Venu & Sunitha.
Vennelintha Vediga song lyrics were written by Bhaskarbhatla Ravikumar.
Vennelintha Vediga song music was composed by Devi Sri Prasad.