
| Movie Name | SP Charan |
|---|---|
| Director | Saleem Malik |
| Star Cast | Anasuya Bharadwaj, Sunil Varma |
| Music | Raprock Shakeel |
| Singer(s) | SP Charan |
| Lyricist | Bhashya Sree |
| Music Label |
వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక
ఇంకెంత ఆడుకుంటావే వగలమారి
వేధించేం మూటకడతావే
ఏడ్పించి ఆనందిస్తావే ప్రేమికుల్ని
భాదించేం బాగుపడతావే
పల్లకి ఎక్కే హృదయాన్ని కోసి
పాడెక్కించేసావెందుకే
వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక
తాళిని కోరితే ఆశతో
ఉరి తాడునే ఇచ్చావెందుకు
మెట్టెనె తెస్తే వేలికి టెన్ టు ఫైవ్
కాలే కట్టెలా మార్చావెందుకు
స్నానాలు ఆడే పన్నీటిలోనే
కన్నీరు కలిపావెందుకు
పందిట్లోకెళ్ళే చిన్నారి మనసుని
కాటికి పంపావెందుకు
వెళ్ళీపోవే వెళ్ళిపోవే
ప్రేమా నీకోదండము
వల్లకాడే చేసేసావే
అందమైన జీవితము
మంటలు రేపే ప్రేమ నువ్వు
జంటగ మార్చకు ఎవ్వరిని
చితికిపోతే ప్రేమలో
బ్రతకలేరే ఎవ్వరూ
విడదీయడమే నీ ఉద్ధేశ్యమైతే
కలపడం అసలెందుకు
కూల్చేయడమే నీ లక్ష్యమైతే
ఆశలు రేపడమెందుకు
వెళ్ళీపోవే వెళ్ళిపోవే
ప్రేమా నీకోదండము
ఊరించేసి ఉరి తీసావే
ప్రేమికుల పసి హృదయము
నమ్మించి గొంతు కోసావే
గంతులాడి మరిపించి మోసం చేసావే
ఏడ్పిచ్చి ఆనందించావే
ప్రేమికుల్ని భాదించేం బాగుపడ్డావే
పల్లకి ఎక్కే హృదయాన్ని తుంచి
పాడెక్కించేసావెందుకే
వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక
Vellipove Darja song is from the SP Charan movie.
Vellipove Darja song was sung by SP Charan.
Vellipove Darja song lyrics were written by Bhashya Sree.
Vellipove Darja song music was composed by Raprock Shakeel.