
| Movie Name | Neetho Yuddham Chestham |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Vandemataram Srinivas Garu |
| Lyricist | |
| Music Label | Vandemataram Srinivas Official |
కరోనా కరోనా… నీతో యుద్ధం చేస్తాం..
మా భారత భూ భాగాన…
కరోనా కరోనా… నిన్ను మట్టి కరిపిస్తాం…
నూట ముప్పై కోట్ల జనం… సరేనా…
మా ఇంట్లో మేముంటాం… నీ కంట్లో కంప కొడతాం…
మేము కాళ్ళు బయట పెట్టం… నీ కాళ్ళు నరికేస్తాం…
మేం చేయి చేయి కలపం… నీ చేతులు విరిచేస్తాం…
మేం మాస్కులు పెట్టుకుంటాం… ముక్కుకు తాడేస్తాం…
మా నోట్లో దూరనియ్యం… నీ నోట్లో దుమ్ము కొడతాం…
మేం ఒంటరిగా ఉంటాం… నీ అంతూ తేలుస్తాం…
కరోనా కరోనా… నీతో యుద్ధం చేస్తాం..
మా భారత భూ భాగాన…
కరోనా కరోనా… నిన్ను మట్టి కరిపిస్తాం…
నూట ముప్పై కోట్ల జనం… సరేనా…
బయటికెళ్ళి ఇంటికొస్తే బట్టలు విడిచేస్తాము..
తల స్నానం చేసి మేము నిన్ను తుడిచి వేస్తాము…
దగ్గు రూపమెత్తి నువ్వు దగ్గరకు రాకుండా…
వేడి నీళ్ళ పసుపు ఉప్పు వేసి పుక్కిలిస్తాము…
ప్రాణాయం చేసి నిన్ను పరుగులు తీయిస్తాము…
ఊపిరిలో కలవకుండ నీ ఊపిరి తీస్తాము…
విందు వినోదాలు బందు.. నీకివ్వబోము సందు..
దేశమంతా లాక్ డౌన్… కరోనా బ్రేక్ డౌన్…
కరోనా కరోనా… నీతో యుద్ధం చేస్తాం..
మా భారత భూ భాగాన…
కరోనా కరోనా… నిన్ను మట్టి కరిపిస్తాం…
నూట ముప్పై కోట్ల జనం… సరేనా…
కన్నబిడ్డలోలె ప్రజల కడుపులోన దాచుకొనగ… కంటి మీద కునుకు లేక ప్రజలను కాపాడాలని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎం, సీఎం లు సమరంలో దూకినారు… సమైక్యతను చాటినారు….
ప్రాణాలను ఎదురుపెట్టి ప్రజాసేవే ప్రాణంగా… తిండి నిదుర కరువైనా, కుటుంబాలే దూరమైనా…
పునఃర్జన్మ ప్రసాదించే డాక్టర్లు, నర్సులకు, ఆసుపత్రి సిబ్బందికి…
మున్సిపల్ కార్మికులను, భద్రతనిచ్చే పోలీస్, మీడియా మిత్రులకు…
వందనాలు.. వందనాలు… అభివందనాలు.. అందరికీ..
వందనాలు.. వందనాలు… అభివందనాలు.. అందరికీ..
అభివందనాలు.. అందరికీ..
Vandemataram Srinivas Corona song is from the Neetho Yuddham Chestham movie.
Vandemataram Srinivas Corona song was sung by Vandemataram Srinivas Garu.