
| Movie Name | Gang Leader (1991) |
|---|---|
| Director | Vijaya Bapineedu |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, Sumalatha, Murali Mohan, Rao Gopala Rao |
| Music | Bappi Lahari |
| Singer(s) | S.P.Balasubramanyam, Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label |
వాన వాన వెల్లువాయే… కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై… మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే… కొండకోన తుళ్లిపోయే
ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై… మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
హోం… తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకుల చలికి ఒణుకుతూ
చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Vana Vana Velluvaye song is from the Gang Leader movie.
Vana Vana Velluvaye song was sung by S.P.Balasubramanyam, Chitra.
Vana Vana Velluvaye song lyrics were written by Bhuvana Chandra.
Vana Vana Velluvaye song music was composed by Bappi Lahari.