
| Movie Name | Donga Dongadi (2004) |
|---|---|
| Director | Subramaniam Siva |
| Star Cast | Manchu Manoj, Sadha |
| Music | Dina |
| Singer(s) | Chitra |
| Lyricist | Kula Sekhar |
| Music Label | Aditya Music |
వయసేమో పదహారు పరుగెత్తే సెలయేరు
పరువాల సిత్రాలు పడుసోళ్ళ ఆత్రాలు
నిదరోని నేత్రాలు నిలువెల్లా గాత్రాలు
మతిపోయే అందాలు శతకోటి దండాలు
వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగీ నేల హరివిల్లై కలుపుదామిలా
మబ్బుల్లో హంసలాగ… మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ… వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ… వాకిట్లో తులసిలాగ
వరిచేలు గువ్వలాగ… పెదవుల్లో నవ్వులాగ
మనమంతా గంతులాడదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం
వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగీ నేల హరివిల్లై కలుపుదామిలా
ఓ దయ్యర దయ్యా దయ్యారే
హే దయ్యర దయ్యా దయ్యారే
అహ తుళ్ళిపడే ఈడులో… తుమ్మచెట్టు నీడలో
చెమ్మచెక్క ఆటలాడుదాం
పొద్దుపొడుపు వేళలో… అత్తమడుగు వాగులో
ఆదమరిచి ఈదులాడుదాం
పక్కింటిలోన కుర్రాడ్ని కదుపుదామా
ఆహ ఆహ ఆహ హా
పక్కింటిలోన కుర్రాణ్ణి కదుపుదామా
మాటలతో మాయచేసి… కథాకళి ఆడిద్దామా
గుండ్రంగా తిప్పిద్దామా… గుంజీలే తీయిద్దామా
గుండ్రంగా తిప్పిద్దామా… గుంజీలే తీయిద్దామా
వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగీ నేల హరివిల్లై కలుపుదామిలా
గడ్డివాము చాటుగా… లంకచుట్ట ఘాటుగా
గుప్పు గుప్పుమంటు లాగుదాం
ఊరి పెద్ద గుట్టుగా… రంగితోటి పచ్చిగా
కులుకుతున్న మాట చాటుదాం
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
డింక టకరి డింక… హే డింక టక, హా
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
వీధుల్లో చేరి మనం… వసంతాలు ఆడేద్దామా
వయ్యారం వలికిద్దామా… సంగీతం పలికిద్దామా
వయ్యారం వలికిద్దామా… సంగీతం పలికిద్దామా
వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగీ నేల హరివిల్లై కలుపుదామిలా
ఓహో హొ, మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ… వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ… వాకిట్లో తులసిలాగ
వరిచేలు గువ్వలాగ… పెదవుల్లో నవ్వులాగ
మనమంతా గంతులాడదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం
లాల లాల లాలలాలాల లా ల
లాల లాల లాలలాలాల లా లా
Vana Vana song is from the Donga Dongadi movie.
Vana Vana song was sung by Chitra.
Vana Vana song lyrics were written by Kula Sekhar.
Vana Vana song music was composed by Dina.